- Advertisement -
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
Distribution of checks by Kalyana Lakshmi at Serilingampally MLA office
రంగారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 173 చెక్కులను బుధవారం శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ కార్యాలయంలో కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, మియాపూర్ కార్పోరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఆల్విన్ కాలనీ వివేకానంద నగర్ ,హైదర్ నగర్, కూకట్పల్లి డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు ఈరోజు షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులను అందజేయడం జరిగిందని తెలిపారు,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమానికి రేవంత్ రెడ్డి గారు పెద్దపీట వేశారని తెలిపారు ఆయన..
- Advertisement -