జర్నలిస్టుల సంక్షేమానికి కేసీఆర్ చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నరు
కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు మరింత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత జర్గలిస్టులపై ఉంది: ఎంపీ రవిచంద్ర
మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు మీడియా అకాడమీ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఎంపీ రవిచంద్ర
అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి,టీయుడబ్లూజే ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్
జర్నలిస్టులు,వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.మృతి చెందిన 92మంది, అనారోగ్యానికి గురైన 4గురు జర్నలిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు తెలంగాణ మీడియా అకాడమీ చెక్కులు అందజేయడం జరిగింది.అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన బేగంపేటలోని టూరిజం ప్లాజాలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ తో కలిసి అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం విషయంలో కూడా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని, సంక్షేమ నిధికి ప్రభుత్వం 42కోట్లు విడుదల చేయడాన్ని గుర్తు చేశారు.దేశంలో మరెక్కడా కూడా లేనివిధంగా కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, ఉన్నతికి అనేక పథకాలు,కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని,వీటికి మరింత ప్రచారం కల్పిస్తున్న బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు పలువురికి చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి, అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, టీయుడబ్లూజే ప్రధాన కార్యదర్శి ఆస్కానీ మారుతీసాగర్ తదితరులు పాల్గొన్నారు.