లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ    

- Advertisement -

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ    

Distribution of Clay Ganeshas under the aegis of Lions Club

నంద్యాల జిల్లా:- సెప్టెంబర్ 06
వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని శుక్ర వారం నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీరామ డిజిటల్ యజమాని,లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు చంద్రమోహన్ సౌజన్యంతో మట్టి వినాయక విగ్రహల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్,కార్యదర్శి శిరిగిరి రమేష్ ల నిర్వహణలో శ్రీరామ డిజిటల్ వద్ద  జరిగిన ఈ కార్యక్రమాన్ని ఐ ఏమ్ ఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి భక్తులకు మట్టి విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటి స్థానంలో మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని,మట్టి వినాయక విగ్రహాల పంపిణీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో  లయన్స్ క్లబ్ సభ్యులు సందీప్, రమేష్, లక్ష్మయ్య,లయన్స్ క్లబ్ యువ విభాగం సభ్యులు మనస్వి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular