- Advertisement -
జోరు వానలో పెన్షన్లు పంపిణీ
Distribution of pensions in heavy rains
తాడేపల్లిగూడెం,
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నందమూరి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలోటిడిపి జనసేన బిజెపి నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జోరు వానను కూడా లెక్కచేయకుండా సచివాలయ సిబ్బంది పెన్షన్లను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ శనగన వరలక్ష్మి భర్త శనగన రాంబాబు పెన్షన్ దార్ల ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. ఎవరైనా అని వారి కారణాలవల్ల వేరే గ్రామానికి వెళ్లిన గ్రామస్తుల వివరాలు ఉంటే సేకరించి వారికి పెన్షన్ అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది అన్నారు. ఈరోజు సాయంత్రానికి 100% పెన్షన్ల పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందని. లేనిపక్షంలో ప్రభుత్వం వారిచ్చిన గడువు సోమవారం నాడు కూడా పెన్షన్ అందించడం జరుగుతుందని కావున పెన్షన్ దారులు ఏ విధమైన ఇబ్బందులు పడవలసిన అవసరం లేదని ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు శనగన రాంబాబు, తాటకుంట్ల శ్రీనివాస్, మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -