- Advertisement -
పూలనే పూజించి దేవతలా చూసుకునే గొప్ప పండుగ బతుకమ్మ-జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
District Collector B.Satya Prasad-Bathukamma greatfestival where flowers worshiped
జగిత్యాల,
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. శనివారం రోజున కలెక్టరేట్ సముదాయంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు వారి వారి శాఖల ద్వారా బతుకమ్మను తీరోక్క పూలతో తయారు చేసి మధ్యలో పెట్టి కోలాటాలు ఉయ్యాల పాటలు డీజే పాటల నడుమ బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన సతిమణితో కలిసి ఉద్యోగులతో బతుకమ్మ ఆడి పాడి వేడుకలలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మన పండగ మన సంస్కృతి మన సాంప్రదాయానికి ప్రతీక ఆడపడుచుల ఔన్నత్యానికి సూచిక అన్నారు. తొమ్మిది రోజులపాటు అడబిడ్డలు అందరూ కలిసి తీరొక్క పూలు, తీరొక్క రంగులతో ఆడుకునే గొప్ప పండగ బతుకమ్మ అని అన్నారు. మహిళలు ఎంతో ఇష్టంతో పూలను పేర్చి గౌరమ్మను తీర్చి కోరిన కోరికలు ఫలించాలనే నమ్మకంతో ఈ బతుకమ్మ పండుగ జరుపుతారని, దేశంలో పూలను పూజించి ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని ఇలాంటి సంస్కృతి మన తెలంగాణలోనే ఉందని, బతుకమ్మ పండుగను అధికారికంగా రాష్ట్ర పండుగగా గుర్తించారని అన్నారు. ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని, బతుకమ్మ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి. రాంబాబు, గౌతమ్ రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరేష్, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, వివిధ జిల్లా శాఖ అధికారులు, మహిళా ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -