విజయవంతంగా శస్త్ర చికిత్సలు అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్

- Advertisement -

విజయవంతంగా శస్త్ర చికిత్సలు

అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి

District Collector congratulates successful scientific treatments

పలు క్లిష్టమైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా  జిల్లా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వైద్యులను జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అభినందించారు. కరీంన గర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన 92 ఏళ్ల  గొట్టేముక్కల వీర రెడ్డి  ఎడమ వైపు తుంటి ఎముక ఫ్రాక్చర్ తో  పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 12న అడ్మిట్ అయ్యారని,  ఎక్కువ వయస్సు, రెండు కిడ్నీ లు సరిగా పని చేయకపోవడం, గుండె పని తీరు సామర్థ్యము సగం మాత్రేమే ఉండటం, కిడ్నీల పనితీరు తక్కువగా ఉండటంతో ఇతని ఇద్దరు కొడుకుల సమ్మతితో  క్లినికల్ కార్డిలోజిస్ట్ తో 2 డి ఎకో పరీక్షలు,  ఇతర రక్త పరీక్షలు నిర్వహించి  డా కే. శ్రీనివాస్ రెడ్డి, డా. కృష్ణవేణి, డా. భవాని, డా. రామం, డా. కె. శ్రీధర్, సూపరింటెండెంట్  పర్యవేక్షణలో 22న శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. అలాగే సుల్తానాబాద్ పట్టణంలోని దుర్గా నగర్ కు చెందిన 32 ఏళ్ల  ఆసియా తబస్సుము షైక్ తీవ్రమైన కడుపు నొప్పితో  ప్రైవేట్ ఆసుపత్రిలో సంప్రదించగా కడుపులో గర్భ సంచి పక్కన వున్నా ట్యూబ్ లో గర్భము ఏర్పడిందని చెప్పారని,  తరువాత అది పగిలిపోయి తీవ్ర రక్త శ్రావముతో పెద్దపల్లి మాత శిశు ఆసుపత్రిలో సంప్రదించారు.  డ్యూటీలో ఉన్న డాక్టర్లు ప్రియాంక,  రామం,  శ్రీధర్, సూపరింటెండెంట్  సకాలంలో స్పందించి సదరు మహిళాకు  అవసరమైన రక్త పరీక్షలు నిర్వహించి  పేషెంట్ కి కౌన్సెలింగ్ ఇచ్చి, రక్తాన్ని ఏర్పాటు చేసి  22 న  క్రిటికల్ శస్త్ర చికిత్స  నిర్వహించి మహిళా ప్రాణాలు కాపాడారని తెలిపారు. క్లిష్టమైన శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందానికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో, ఎం సి హెచ్ లో ఆధునిక వైద్యం అందుబా టులోకి వచ్చిందన్నారు. ప్రతి గర్భిణీకి 2డి ఈకో తో పాటుగా ప్రతి ఆర్గాన్ ని పరీక్షించే టిఫా స్కాన్లను అందుబాటులో కి తీసుకు వచ్చామని, కష్టతర మైన శస్త్ర చికిత్సలను సైతం విజయవంతంగా నిర్వహిస్తు న్నామని, దీనిని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular