ఈవియం గోడౌన్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
District Collector Rajakumari Gania supervised the Evium godowns
*నంద్యాల,
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పర్యవేక్షించారు. శుక్రవారం టేక్కే మార్కెట్ యార్డ్ లోని ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమక్షంలో కలెక్టర్ పరిశీలించారు.
*ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమక్షంలో గోడౌన్లకు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భధ్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిష్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈవీఎంల గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు. డిఆర్‌ఓ రామునాయక్, ఆర్డీఓ విశ్వనాధ్, ఎన్నికల విభాగపు తాసిల్దార్ జయప్రసాద్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులైన కాంగ్రెస్ తరపున సయ్యద్ రియాజ్ బాషా, వైయస్సార్సీపి తరఫున సాయిరాం రెడ్డి, టిడిపి తరఫున శివరామిరెడ్డి, సిపిఎం తరపున నరసింహులు, బిజెపి తరఫున కసెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.