జిల్లా.శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా “30 పోలీస్ యాక్ట్” అమలు
జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి,
District. Implementation of “30 Police Act” across the district with the aim of maintaining law and order District SP: Sunitha Reddy
మార్చి 1 నుంచి 31 వరకు “30 పోలీస్ యాక్ట్” అమలు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం.ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యక్రమాలకు కఠిన చర్యలు.
జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం, ప్రజల సాధారణ జీవనాన్ని నిరంతరాయంగా కొనసాగించడం, అనవసర గుమికూడింపులు నివారించడం లక్ష్యంగా మార్చి 01 నుంచి మార్చి 31 వరకు 30 పోలీస్ యాక్ట్–1861 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి, , ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ… జిల్లా పరిధిలో ప్రజా జీవనాన్ని అంతరాయం కలిగించే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎవరైనా పోలీసు ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, భారీ స్థాయి సమావేశాలు నిర్వహించడం కఠినంగా నిషేధం. ప్రజా జీవనాన్ని అంతరాయం కలిగించే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యకైనా చోటిలేదు” అని స్పష్టం చేశారు. అలాగే “30 పోలీస్ యాక్ట్” ఉల్లంఘనలకు చట్టంలో స్పష్టమైన శిక్షలు ఉన్నాయి. అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపట్టిన వారిపై ఎటువంటి మినహాయింపు లేకుండా చర్యలు తీసుకుంటాం. నిబంధనలు ప్రజల భద్రత కోసం పెట్టబడ్డాయి… అందరూ తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఏ కార్యక్రమం కావాలన్నా ముందుగానే దరఖాస్తు చేసి అనుమతి పొందండి. ప్రజల సహకారం వల్లనే శాంతిభద్రతలు నిలుస్తాయి. పోలీసుల చర్యలు ప్రజల రక్షణ కోసమేనని ఎస్పీ తెలిపారు.



