పెన్షనర్ల జిల్లా నేత విద్యాసాగర్ మృతి
జగిత్యాల
తెలంగాణ పెన్షనర్ల,తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు ,రిటర్డ్ మార్కెట్
సూపర్ వైజర్ గొర్రె విద్యాసాగర్(77) శనివారం ఉదయం గుండె పోటుతో జగిత్యాల పట్టణము లోని స్వగృహంలో మృతి చెందారు.వారి కుటుంబాన్ని పరామర్శించి,అంత్యక్రియల్లో తెలంగాణ పెన్షనర్స్,సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్స్ జిల్లా,డివిజన్,మండలాల ప్రతినిధులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.వ్యవసాయ మార్కెట్ కార్యాలయం తరపున అంత్యక్రియల ఖర్చులు రూ.30 వేలు అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ పెన్షనర్స్,సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్,మార్కెట్ కమిటీ జిల్లా అధికారి ప్రకాష్,మార్కెట్ గ్రేడ్ వన్ కార్యదర్శి రాజ శేఖర్,సీనియర్ సిటీజేన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,పెన్షనర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి వెలుముల ప్రకాష్ రావు,మహిళా కార్యదర్శి బోబ్బాటి కరుణ,కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివనందం,
జిల్లా ప్రతినిధులు నారాయణ,
దేవేందర్ రావు,పి.ఆశోక్ రావు,
సత్యనారాయణ,సతీష్ రాజు,గంగమ్మ,కమల,గంగారాం,యాకూబ్,మార్కెట్ కార్యాలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.