ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి
District Medical Officer who inspected private hospitals
జయశంకర్ భూపాలపల్లి,
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రులు నడపాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రులను జిల్లా వైద్యది కారి మధుసూదన్ తనిఖీలు చేశారు. ఆసుపత్రులలో నీ క్యాజువాలిటి,ల్యాబ్, ఎక్సేర్ రూమ్, మెడికల్ స్టార్స్, అల్ట్రా సౌండ్ మెషిన్ గదులను తనిఖీలు చేశారు. ప్రైవేట్ ఆసుపతుల యాజమాన్యాలు నిబద్ధతతో వైద్య సేవలు అందించాలని రోగులకు ఇష్టారీతిన పరీక్షలు నిర్వహించకుండా అవసరాన్ని బట్టి పరీక్షలు నిర్వహించాలని రోగులకు పరీక్షలకి సంబంధించిన రెట్లపట్టిక,ల్యాబ్ టెస్టుల ధరల పట్టికలను ,తెలుగు ఇంగ్లీషు భాషలలో ఏర్పాటు చేయాలని సూచించారు. హోమియో ఆసుపత్రులలో హోమియో వైద్యం మాత్రమే నిర్వహించాలని తెలిపారు. గైనకాలజిస్ట్ ,రీడియలగిస్ట్ లేని అల్ట్రా సౌండ్ మెషిన్ లను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. ధనార్జనే ధ్యేయంగా కాకుండా మానవతా దృక్పధంతో వైద్య సేవలు అందించాలని తెలిపారు.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రవి రాథోడ్, పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ శ్రీదేవి, ఇన్చార్జి డెమో శ్రీదేవి డాటా ఆపరేటర్ మహేష్ పాల్గొన్నారు