- Advertisement -
వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ ఆయుధాల నైపుణ్యాలను పరీక్షించిన జిల్లా ఎస్పీ నంద్యాల
District SP Nandyala tested weapons skills in the annual firing practice
నంద్యాల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కర్నూలు మండలం, దిన్నేదేవరపాడు గ్రామ దగ్గర ఉన్న జగన్నాథగట్టు సమీపంలోని ఫైరింగ్ రేంజ్ లో జిల్లాలోని పోలీసు అధికారులు 2024 సంవత్సరంకు గాను పైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా శనివారం వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ లో పాల్గొని ఫిస్టల్ ద్వారా ఫైరింగ్ సాధన చేశారు. పోలీసు అధికారులు తమ విధుల్లో వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఫైరింగ్ ప్రాక్టీస్ లో పోలీసులు విధుల్లో వినియోగించే ఆయుధాలతో ఫైరింగ్ చేయించారు.ఫైరింగ్ లో ప్రతి ఒక్కరు పాల్గొని మంచి మెళకువలు నేర్చుకోవాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు చాలా కీలకమన్నారు. అత్యవసర సమయాలలో ప్రజల మాన,ధన,ప్రాణ రక్షణకై ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలన్నారు. ఫైరింగ్ లో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ .యుగంధర్ బాబు, జిల్లా సాయుధ బలగాల అడిషనల్ ఎస్పీ చంద్రబాబు , డిఎస్పీలు శ్రీనివాస్ రెడ్డి, రామంజి నాయక్, రవికుమార్ ,శ్రీనివాస్ లు , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మంజునాథ్ శ్రీనివాసులు నాగభూషణం మరియు జిల్లాలోని పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -