Sunday, September 8, 2024

కరెంట్ తీగలు పట్టుకుంటారా

- Advertisement -

అదిలాబాద్, నవంబర్ 17, (వాయిస్ టుడే):  కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తుంటే లేదు అంటున్నారు..  రేవంత్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు విద్యుత్ వైర్లు పట్టుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మంచిర్యాల జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా.. రేవంత్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు విద్యుత్ వైర్లు పట్టుకోవాలని తెలిపారు. ప్రతీ రాత్రి అనాడు జాగరమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులకు జాగారమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించండి అని తెలిపారు. రైతు బంధు ఎవ్వరైనా ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. రైతు గుండె దైర్యంతో, రైతు బంధు వస్తుంది అనే ధీమాతో రైతులు ఉన్నారని అన్నారు. మంచిర్యాలకు మెడికల్ కాలేజీ తెచ్చింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ఐటి హబ్ కావాలా …పేకాట క్లబ్ కావాలా… అని ప్రశ్నించారు. స్కీంలు కావాలంటే కారుకు స్కాంలు కావాలంటే కాంగ్రెస్ కి వేయండని తెలిపారు. రాబందుల చేతుల్లో పడి చావండని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.మరోవైపు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రేవంత్ ది వ్యవసాయం చేసిన మొఖమేనా? అని ప్రశ్నించారు. గజ్వేల్ లో కాంగ్రెస్ అభ్యర్థి పత్తా లేడని వ్యంగాస్త్రం వేశారు. సిద్దిపేటలో నాకు లక్ష మెజారిటీ ఇచ్చారని అన్నారు. గజ్వేల్ లో పెద్ద సారు కేసీఆర్ కి నాకంటే ఎక్కువ మెజారిటీ ఇవ్వాలన్నారు. బూతులు మాట్లాడే నాయకులకు పోలింగ్ బూత్ లో మీ ఓట్లతో సమాధానాలు ఇవ్వండి అని మంత్రి అన్నారు. పెద్ద మనిషిని పట్టుకుని ఒకటే బూతులు తిడుతున్నారని అన్నారు. కటిక వేస్తే వచ్చే కరెంట్ కావాలా..? కటిక చీకట్ల కాంగ్రెస్ కరెంట్ కావాలా..?అని ప్రశ్నించారు. కర్ణాటక లో కాంగ్రెస్ వచ్చాక మూడు గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. రేవంత్ రెడ్డి 10HP మోటర్ కొనాలి అంటున్నారని తెలిపారు. రేవంత్ ది వ్యవసాయం చేసిన మొఖమేనా? అని ప్రశ్నించారు. పొరపాటున కాంగ్రెస్ కి ఓటేస్తే మూడు గంటల కరెంట్ వస్తుందని అన్నారు.

Do current wires hold
Do current wires hold

వ్యవసాయం చేసే మొహమా…

సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రేవంత్ ది వ్యవసాయం చేసిన మొఖమేనా? అని ప్రశ్నించారు. గజ్వేల్ లో కాంగ్రెస్ అభ్యర్థి పత్తా లేడని వ్యంగాస్త్రం వేశారు. సిద్దిపేటలో నాకు లక్ష మెజారిటీ ఇచ్చారని అన్నారు. గజ్వేల్ లో పెద్ద సారు కేసీఆర్ కి నాకంటే ఎక్కువ మెజారిటీ ఇవ్వాలన్నారు. బూతులు మాట్లాడే నాయకులకు పోలింగ్ బూత్ లో మీ ఓట్లతో సమాధానాలు ఇవ్వండి అని మంత్రి అన్నారు. పెద్ద మనిషిని పట్టుకుని ఒకటే బూతులు తిడుతున్నారని అన్నారు. కటిక వేస్తే వచ్చే కరెంట్ కావాలా..? కటిక చీకట్ల కాంగ్రెస్ కరెంట్ కావాలా..?అని ప్రశ్నించారు. కర్ణాటక లో కాంగ్రెస్ వచ్చాక మూడు గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. రేవంత్ రెడ్డి 10HP మోటర్ కొనాలి అంటున్నారని తెలిపారు. రేవంత్ ది వ్యవసాయం చేసిన మొఖమేనా? అని ప్రశ్నించారు. పొరపాటున కాంగ్రెస్ కి ఓటేస్తే మూడు గంటల కరెంట్ వస్తుందని అన్నారు.గజ్వేల్ లో తిరిగే బీజేపీ అభ్యర్థిని గ్యాస్ సిలిండర్ 1200 రూపాయలు ఎందుకు అయ్యిందని నిలదీయండి అన్నారు. ఈ రాష్ట్రంలో బిజెపి వస్తుందా..? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు వచ్చింది.. ఈ సారి డక్ ఔట్ అవుతుందని తెలిపారు. బీజేపీకి ఓటేస్తే మీ బావి కాడ మీటర్ వస్తుందన్నారు. కేసీఆర్ కి ఓటేస్తే 24 గంటల కరెంట్ వస్తుందని తెలిపారు. బీజేపీ పార్టీకి గజ్వేల్ లో ఓటు అడిగే హక్కు లేదని మండిపడ్డారు. నిన్న మొన్నటి వరకు గజ్వేల్ అభివృద్ధి చెందిందని లొల్లి పెట్టారని గుర్తుచేశారు. గజ్వేల్ అభివృద్ధికి కాళ్ళలోకి కట్టెలు పెడుతున్నారు ఇతర పార్టీల నాయకులు అంటూ మండిపడ్డారు. కులం పేరుతో, బంధువుల పేరుతో గజ్వేల్ వస్తున్నారని తెలిపారు. నవంబర్ 30 తర్వాత గజ్వేల్ లో కేసీఆర్ తప్ప ఎవ్వరు ఉండరని అన్నారు. కంటికి రెప్పలా కార్యకర్తలును కాపాడుకుంటామని మంత్రి అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్