భారతీయులు శక్తిని ఆరాధిస్తామా లేదా శక్తి వినాశనం కోరుతారా!
జగిత్యాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ
జగిత్యాల మార్చ్ 18
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన శక్తి వ్యాఖ్యలపై ఇవాళ ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా శక్తి వినాశనాన్ని కోరుతారా అని ఆయన ప్రశ్నించారు. జగిత్యాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత నేలపై ఎవరైనా శక్తి వినాశనం గురించి మాట్లాడుతారా, మనం అందరం శక్తిని ఆరాధిస్తామా లేదా అని ఆయన అడిగారు. యావత్ భారత దేశం శక్తిమాతను ఆరాధిస్తుందన్నారు. చంద్రయాణ్ సఫలతను కూడా శక్తిగా గుర్తించామని, ల్యాండర్ దిగిన చోటుకు శివశక్తి అని పేరు పెట్టినట్లు ప్రధాని మోదీ గుర్తు చేశారు.ఇండియా కూటమి తన మ్యానిఫెస్టోలో శక్తి గురించి ప్రస్తావన చేసిందని, కానీ తనకు ప్రతి తల్లి, కూతురు, సోదరి శక్తి రూపమే అని అన్నారు. వారందర్నీ శక్తిగా ఆరాధిస్తానన్నారు. భారత మాతను ఆరాధిస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో శక్తిని నాశనం కోరుకున్నదని, ఆ సవాల్‌ను స్వీకరిస్తున్నానని, శక్తిని కాపాడుకునేందుకు తన ప్రాణాలను అడ్డువేస్తానని ప్రధాని మోదీ అన్నారు. శక్తిని ఆరాధించేవారికి, శక్తిని నాశనం చేయాలనుకునే వారి మధ్య పోరాటం సాగుతుందన్నారు. జూన్ 4వ తేదీన ఆ పోరాటం ముగుస్తుందన్నారు.భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం రాహుల్ మాట్లాడుతూ హిందూమతంలో శక్తి అన్న పదం ఉన్నదని, ఆ శక్తితో తాము పోరాడుతున్నామని, ఆ శక్తి ఏంటన్నదే ప్రశ్న అని, ఓ రాజు ఆత్మ ఈవీఎంలో ఉన్నదని, ఇది నిజం అని, ఈడీ, సీబీఐ, ఆదాయ పన్నుశాఖ లాంటి సంస్థలపైనే ఆ రాజు ఆత్మ ఉందని రాహుల్ విమర్శించారు.
భారతీయులు శక్తిని ఆరాధిస్తామా లేదా శక్తి వినాశనం కోరుతారా!
- Advertisement -
- Advertisement -