అయోధ్యలో భవ్య రామాలయ ప్రారంభోత్సవం రోజున అందరు రావద్దు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
అయోధ్య డిసెంబర్ 30
యావత్ ప్రపంచం అయోధ్యలో భవ్య రామాలయ ప్రారంభోత్సవం రోజు కోసం ఎదురుచూస్తోందని, జనవరి 22న జరిగి కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఉంటుందని, అయితే అది సాధ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కొందరినే ఈ ఈవెంట్‌కు ఆహ్వానించినందున ఆరోజు రావాలని అనుకోవద్దని ప్రజలను కోరారు. లాంఛనంగా రామాలయం ప్రారంభమైన అనంతరం 23వ తేదీ తర్వాత ఎవరికి వారు తమ వీలును బట్టి వచ్చి దర్శించుకోవచ్చని సూచించారు. ఆరోజు ఇళ్లల్లో దీపాలు వెలిగించి సెలబ్రేట్ చేసుకోవాలని సూచించారు. అయోధ్యలో ప్రధాని పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి 15,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభించారు. పలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనవరి 22వ తేదీ చారిత్రక క్షణాల కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని, సహజంగానే అయోధ్య వాసుల్లో మరింత ఎక్కువ ఉత్సాహం తొంగిచూస్తోందని అన్నారు. ఈ పుణ్యభూమిలోని అణువణువునూ తాను ఆరాధిస్తుంటానని, అందరిలాగే తాను కూడా రామమందిరం ప్రారంభమయ్యే ఘడియల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.
అయోధ్యలో భవ్య రామాలయ ప్రారంభోత్సవం రోజున అందరు రావద్దు
- Advertisement -
- Advertisement -