- Advertisement -
హరీష్ రావు ను అరెస్టు చేయవద్దు
Do not arrest Harish Rao
హైదరాబాద్
మాజీ మంత్రి హరీష్రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో పోలీసులు హరీశ్ రావుపై కేసు నమోదు అయింది. హరీష్ రావు పిటిషన్ ను విచారించిన కోర్టు అయనను అరెప్టు చేయవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. పోలీసు కేసులో పిర్యాదు చేసిన చక్రధర్ గౌడ్ కు నోటీసులు జారీ చేసింది.
పంజాగుట్ట పోలీసులు తనపై నమోదు చేసిన కేసు రాజకీయ కక్షలో భాగమని ఆరోపిస్తూ హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తప్పుడు కథనాల ఆధారంగా తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని
హైకోర్టును ఆయన అభ్యర్థించారు.
- Advertisement -


