అపరిచితుల వ్యక్తుల మాటలు నమ్మవద్దు, నమ్మి మోసపోయి జీవితాన్ని కోల్పోవద్దు
Do not believe the words of strangers, do not lose your life by being deceived
సిద్దిపేట
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీటీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీటీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి, ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు,నూతన చట్టాల గురించి, మరియు అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దు, సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుందిమహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం మహిళల భద్రత మా ముఖ్య బాద్యత. చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు అన్నారు, ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని మరియు సామాజిక రుగ్మతల గురించి సెల్ఫోన్ కు ఎంత దూరం ఉంటే అంత మంచిది సెల్ ఫోన్ వల్ల ఎంత మంచి ఉందో అంత చెడు ఉంది దానికి అలవాటు పడి బానిసలు కావద్దు విద్యార్థి దశ చాలా కీలక కష్టపడే తత్వం కష్టపడి చదువుకోవడం చాలా ముఖ్యమని మహిళలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మరియు అవహేళనగా మాట్లాడిన వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ షీటీమ్ నెంబర్ 8712667434 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సమాచార అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. మరియు నూతన చట్టాల గురించి నూతన చట్టాలలో మహిళల రక్షణకు పెద్దపీట వేయడం జరిగిందని అవగాహన కల్పించిన
సిద్దిపేట షీటీమ్ ఏఎస్ఐ కిషన్, మహిళా కానిస్టేబుల్ మమత, కానిస్టేబుల్ ప్రవీణ్
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ గోపి, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.