- Advertisement -
బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కు టికెట్ ఇవ్వొద్దు..
పెట్రోల్ పోసుకొని నిరసన వ్యక్తం చేసిన బిజెపి కార్యకర్త
హైదరాబాద్
బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నాంపల్లిలోని బిజెపి కార్యాలయం ముందు జగిత్యాల బిజెపి నాయకులు ఆందోళన చేసారు. పెట్రోల్ పోసుకొని జగిత్యాల జిల్లా కి చెందిన సతీష్ అనే కార్యకర్త నిరసన వ్యక్తం చేసారు. నిజామాబాద్ ఎంపీ టికెట్ అరవింద్ కు ఇవ్వొద్దని డిమాండ్ చేసారు. ఎంపీ గా గెలిచిన అరవింద్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడు. గత 30 ఏళ్ళు గా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను పట్టించుకోవడం లేదు. అరవింద్ కు టికెట్ ఇస్తే ఒడిస్తామని జగిత్యాల జిల్లా బిజెపి నాయకులు అన్నారు.
- Advertisement -