పవన్ పై నేతల ముప్పేట దాడులు
విజయవాడ అక్టోబరు 5: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి జోగి రమేష్.. తాడేపల్లిలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. పెడనలో పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇదే సమయంలో.. 2024 తర్వాత పవన్ కల్యాణ్‌తో రెండు సినిమాలు తీస్తానని ప్రకటించారు.. అంతే కాదు.. సినిమా పేర్లను కూడా అనౌన్స్ చేశారు. ఒకటి ‘జానీ-ఖూనీ’.. మరోటి ‘గబ్బర్ సింగ్ – రబ్బర్ సింగ్’ అని ప్రకటించారు. ఎందుకంటే 2024 ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ కు పనేమీ ఉండదు కదా? అందుకే ఆయనతో రెండు సినిమాలో తీస్తానంటూ ఎద్దేవా చేశారు మంత్రి జోగి రమేష్.ఇక, పెడనలో అటెన్షన్ కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశారని ఆరోపించారు మంత్రి రమేష్.. సినిమా స్టైల్ లో కత్తులు, కటార్లు, రాళ్ళ తో దాడులు అని హడావిడి చేశాడు.. రెండు వేల మందితో దాడులు అన్నాడు. పవన్ సభకు రెండు వేల మంది కూడా రాలేదన్నారు.. అవనిగడ్డ లో పవన్ ఫ్లాప్ షో.. పెడనలో సూపర్ డూపర్ ప్లాప్ షో అని వ్యాఖ్యానించారు. జనసేన – టీడీపీ కలయిక వ్యాక్సిన్ కాదు పాయిజన్ అని దుయ్యబట్టారు.. పెడన ప్రజలు శాంతి కాముకులు.. అటువంటి ప్రజల పై ఆరోపణలు చేసినందుకు పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.. అత్తారింటికి దారేది సినిమా పైరసీ చేశారనే పేరుతో పెడనలో 30 మందిని అరెస్టు చేసి చిత్రహింసలు చేసిన చరిత్ర పవన్ కళ్యాణ్ ది అని మండిపడ్డారు. కాగా, పవన్ కల్యాణ్ సినీ కెరీర్‌లో సూపర్ హిట్ అయిన సినిమాల్లో జానీ, గబ్బర్ సింగ్ ఉన్న విషయం విదితమే.. ఇప్పుడు ఆ సినిమాలను ‘జానీ-ఖూనీ’.. ‘గబ్బర్ సింగ్ – రబ్బర్ సింగ్’ పేర్లతో తీస్తానంటూ ఎద్దేవా చేశారు మంత్రి జోగి రమేష్. ఇక, తనపై ఎవరైనా కామెంట్లు చేసే పవన్ కల్యాణ్.. మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలకు ఎలా కౌంటర్ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
దమ్మేంటే నాపై పోటీ చేయాలి
త ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించిన ఎమ్మెల్యేకు కీలక పోస్టు అప్పగించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. శాసనసభలో ప్రభుత్వ విప్ గా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ను నియమించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.. మోవైపు.. శాసనమండలిలో ముగ్గురు ప్రభుత్వ విప్‌లను నియమించింది ప్రభుత్వం.. మండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, మెరిగ మురళీధర్, పాలవలస విక్రాంత్‌ను ప్రభుత్వ విప్‌లుగా నియమించారు.. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.కాగా, తత సార్వత్రిక ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ ఓడిపోయారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించారు.. ఇక, పవన్ పోటీ చేసిన మరో నియోజకవర్గం- గాజువాకలో కూడా ఓటమిపాలైన విషయం విదితమే.. మళ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్న గ్రంధి శ్రీనివాస్.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటోన్నారు.. పవన్ కల్యాణ్ ను ఓడించిన జెయింట్ కిల్లర్ గా పేరుతెచ్చుకున్నారు. ఇక, ఆ మధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై గ్రంధి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కూడా పవన్ కల్యాణ్ తెలియట్లేదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే మరోసారి భీమవరం నుంచి పోటీ చేయాలని సవాల్ చేసిన విషయం విదితమే
సుబ్బారెడ్డి ఫైర్
వారాహి యాత్రలో ఏపీ ప్రభుత్వం, అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.. విశాఖకు చేరుకున్న మూడు జిల్లాల కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డికి ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు నేతలు, కార్యకర్తలు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారాహి యాత్ర అనేది గతంలో కూడా ఉన్నదే.. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదన్నారు. అప్పుడు పొత్తులు బైట పడలేదు.. ఇప్పుడు చంద్రబాబు అవినీతి చేసి జైలుకు వెళ్లడంతో పవన్ కల్యాణ్ సింపతికోసం పొత్తులు పెట్టుకున్నాడు అని ఆరోపించారు. తప్పుచేసిన వ్యక్తికి ఏవిధంగా సపోర్ట్ చేస్తారు..? అని ప్రశ్నించారు. న్యాయస్థానంలో కూడా బెయిల్ రాక జైలులో ఉన్న వ్యక్తికి ఏ విధంగా మద్దతు తెలుపుతారు? అంటూ పవన్ ను నిలదీశారు వైవీ సుబ్బారెడ్డి.ఇక, మహిళలను కించపరిచి, జైలుకు వెళ్లి వచ్చినవారు కూడా సంబరాలు చేసుకోవడం చాలా విడ్డూరంగా ఉందంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై సెటైర్లు వేశారు వైవీ సుబ్బారెడ్డి.. మరోవైపు.. విశాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి నెల వస్తున్నారు.. పరిపాలన విషయంలో అధికారులు తగు ఏర్పాట్లు చేసిన వెంటనే పూర్తిగా ఇక్కడ నుండి పాలన కొనసాగిస్తారని వెల్లడించారు. చంద్రబాబు విషయంలో న్యాయస్థానం కూడా సరైన నిర్ణయాన్ని ప్రకటించడం వలన ప్రజలకు న్యాయస్థానాల పట్ల మరింత గౌరవం పెరిగిందన్నారు. చట్టం అందరికీ సమానమే అని, తప్పుచేసిన ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు వైవీ సుబ్బారెడ్డి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర, టీడీపీ-జనసేన పొత్తు, పెడనలో వారాహి యాత్ర బహిరంగ సభపై సెటైర్లు వేశారు మంత్రి జోగి రమేష్.. పెడనలో అటెన్షన్ కోసం పవన్ కల్యాణ్ ప్రయత్నం.. సినిమా స్టైల్ లో కత్తులు, కటార్లు, రాళ్లతో దాడులు అని హడావిడి చేశాడు.. రెండు వేల మందితో దాడులు అన్నాడు.. కానీ, పవన్ సభకు రెండు వేల మంది కూడా రాలేదని విమర్శించారు. అవనిగడ్డలో పవన్ ఫ్లాప్ షో.. పెడనలో సూపర్ డూపర్ ప్లాప్ షో అని దుయ్యబట్టారు. ఇక, జనసేన – టీడీపీ కలయిక వ్యాక్సిన్ కాదు పాయిజన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. చంద్రబాబు స్కిల్ స్కాంలో ఆధారాలతో దొరికి ఊచలు లెక్క పెట్టుకుంటున్నాడు.. జైల్లో ఉన్న దత్త తండ్రి కోసం పవన్ పాకులాడుతున్నాడని మండిపడ్డారు.పెడన ప్రజలు శాంతి కాముకులు.. అటువంటి ప్రజలపై ఆరోపణలు చేసినందుకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు జోగి రమేష్.. అత్తారింటికి దారేది సినిమా పైరసీ చేశారనే పేరుతో పెడనలో 30 మందిని అరెస్టు చేసి చిత్రహింసలు చేసిన చరిత్ర పవన్ కల్యాణ్‌ది అని ఆరోపించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ బ్లడ్ ఎక్కించుకున్నావా? ప్యాకేజీ వచ్చిందని బ్లడ్ ఎక్కించుకున్నావా? అంటూ ఎద్దేవా చేశారు. నీకు లాగా కాపు సామాజికవర్గం అమ్ముడు పోదు.. రంగాను చంపిన వాళ్ళ పల్లకి మోస్తావా? అని నిలదీశారు. పవన్ ను రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మబోరన్న ఆయన.. పవన్ కల్యాణ్ పావలా.. పావలాలు పంచుకునే పావలాగాళ్లు మీరంతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.టీడీపీకి ఖర్మ పట్టింది.. చంద్రబాబు జైల్లో ఉంటే టీడీపీ నాయకులు పవన్ కల్యాణ్ సభ దగ్గర పడిగాపులు పడుతున్నారని ఎద్దావే చేశారు జోగి రమేష్.. పవన్ కల్యాణ్ భారతీయుడో, రష్యా వాడో తెలియదు.. భారతీయులు, ఆంధ్రవాళ్లకు పాస్ పోర్ట్ అక్కర లేదు.. రష్యా వాడికి మాత్రం పాస్ పోర్ట్ కావాల్సిందే అని సెటైర్లు వేశారు. ఈ పెత్తందార్లు అంతా వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం కానున్నారని వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కానున్నారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్.