- Advertisement -
అల్ టైం రికార్డు..ఇప్పుడు తులం బంగారం ఎంతో తెలుసా..?
అందరికి అత్యంత ఇష్టమైన, అత్యంత విలువైన లోహాలలో ఒకటైనది బంగారం. అయితే దీని ధరలు ప్రతిరోజూ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధర పలుమార్లు కొత్త రికార్డులను నమోదు చేసాయి. కాగా ఇప్పుడు బంగారం ధరలు తొలిసారిగా తులం రూ.72 వేల స్థాయిని దాటి శుక్రవారం కూడా ఈ రికార్డుల పరంపర కొనసాగుతోంది. బంగారం ధరలు రూ.72 వేల స్థాయిని దాటడం చరిత్రలో తొలిసారి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు.
- Advertisement -