Wednesday, April 29, 2026

మోటో నుండి కొత్త 5G మొబైల్ ధర ఎంతో తెలుసా….?

- Advertisement -

మోటో నుండి కొత్త 5G మొబైల్ ధర ఎంతో తెలుసా….?

Do you know the price of the new 5G mobile from Moto?

ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ మోటోలోని ‘జీ’ సిరీస్ నుండి కొత్త మొబైల్ విడుదల అయింది. మోటో జీ-45 యొక్క ధర, ఫీచర్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

మొబైల్ తయారీ కంపెనీ అయిన మోటోరోలా జీ సిరీస్ మీద కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. మోటో జీ 45 పేరిట దీన్ని మార్కెట్ లో కి ఆవిష్కరించింది. కెమెరా విషయానికి వస్తే 50 MP డ్యుయల్ రియర్ కెమెరా, ip52 రేటింగ్ తో ఈ మొబైల్ నీ లాంచ్ చేసింది.

మోటో జీ45 5G సిరీస్ లో రెండు వేరియంట్ లో ఇది లభిస్తుంది. 4GB + 128GB వేరియంట్ ధర రూ.10,999 ధర కాగా …… 8GB + 128GB వేరియంట్ ధర రూ. 12,999 గా మోటో కంపనీ నిర్ణయించింది. వీటి యొక్క రంగుల విషయానికి వస్తే బ్రిలియంట్ బ్లూ, బ్రిలియంట్ గ్రీన్, వివా మెజెంటా రంగులో లభిస్తాయి. ఇవి మార్కెట్ లో ఆగస్టు 28 నుండి అందుబాటులో ఉంటాయి. ఈ యొక్క మొబైల్ ఫోన్లనీ మోటోరోలా వెబ్సైట్ లో, ఫ్లిప్కార్ట్ తో పాటు ఇతర రిటైల్ దుకాణాల్లో కొనుగోలు చేయొచ్చు. డిస్కౌంట్ విషయానికి వస్తే ఆక్సిస్ బ్యాంక్ , ఐడీఎఫ్‍సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 10వ తేది వరకు అందుబాటులో ఉంటుంది .

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే 6.5 అంగుళాల HD + LCD డిస్ ప్లే వస్తుంది. అలానే 240HZ టచ్ సాంప్లింగ్ రేట్ , 120HZ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. ఇందులో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 6S జనరేషన్ 3 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇది వరకు ఆండ్రాయిడ్ 14తో పని చేసే ఈ మొబైల్ అప్ గ్రేడ్ చేసి ఆండ్రాయిడ్ 15 లోకి మార్చారు. మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. 50MP బ్యాక్ కెమెరా 2 MP మ్యాక్రో సెన్సార్. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. అలానే బ్యాటరీ విషయానికి వస్తే 5000Mah , 20W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కల్పించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్