అయ్యప్ప భక్తుల కష్టాలు మీకు కన్పించవా?
తబ్లిగీ జమాతేకు నిధులిచ్చిన సర్కార్.. స్వాములకు సౌకర్యాలకు నిధులెందుకు ఇవ్వడం లేదు?
పాస్టర్లకు, ఇమామ్ లకు జీతాలిస్తూ… అర్చకులు, గురువులను గాలికొదిలేస్తారా?
హిందూ మత విశ్వాాసాలను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది
హిందువులను హింసించిన మొగల్స్ రాజుల చరిత్ర పాఠ్యాంశాల్లో పెడతారా….
స్పూర్తిదాయకమైన గురుగోవింద్ సింగ్ చరిత్రను మరుగున పడేస్తారా?
హిందూ సమాజమంతా ఆలోచించండి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు
కరీంనగర్ లో నిర్వహించిన వీర బాల దివస్ లో పాల్గొన్న సంజయ్
తీవ్రవాదులను తయారు చేస్తూ బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతున్న తబ్లిక్ జమాతే సంస్థ కు నిధులిస్తున్న ప్రభుత్వం 41 రోజుల కఠోర దీక్ష చేసే అయ్యప్ప స్వాములకు సౌకర్యాలు కల్పించేందుకు నిధులెందుకు కేటాయించడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ‘‘శబరిమలలో గత కొద్దిరోజులుగా అయ్యప్ప స్వాములు పడుతున్న బాధలు మీ కళ్లకు కన్పించడం లేదా? అక్కడ తాగడానికి నీళ్లు లేవు. తినడానికి తిండి లేదు. గజగజ వణికి చలిలో గంటల తరబడి నిలబడి అరిగోస పడుతున్న దారుణ ద్రుశ్యాలు మీడియా, సోషల్ మీడియాలో వస్తున్నయ్. చిన్న పిల్లోడిని కదిలించినా ఆ స్వాముల కష్టాలు చెబుతారు… మరి పాలకులకు కనబడకపోవడం సిగ్గు చేటు’’అని అన్నారు.
‘వీర్ బాల దివస్’ సందర్భంగా ఈరోజు కరీంనగర్ లోని సిక్కులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్ వారితో కలిసి గురుద్వార్ కు విచ్చేసి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు…
ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం కుట్ర చేస్తున్నారు. హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్ర చేస్తున్నారు. ఎక్కువ మంది దర్శించుకునే ధార్మిక ప్రదేశాల్లో భయానక వాతావరణాన్ని స్రుష్టిస్తూ, సరైన సౌకర్యాలు కల్పించకుండా చేయడంవల్ల భక్తులు రాకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారు. తిరుమలలోనూ పులులు వస్తున్నాయనే భయంతో భక్తులు రాకుండా చేస్తూ హిందూ సనాతన ధర్మాన్ని దెబ్బతీసేలా కుట్ర జరుగుతోంది.
హిందూ సమాజమంతా ఆలోచించాలని కోరుతున్నా. మసీదులో పనిచేసే ఇమామ్ లకు, చర్చిల్లో పనిచేసే ఫాస్టర్లకు జీతాలిస్తున్న ప్రభుత్వం ఆలయ పూజారులకు, గురుద్వారాలో పనిచేసే గురువులకు జీతాలెందుకు ఇవ్వడం లేదో ఆలోచించండి. ఒక వర్గం ఓట్ల కోసం హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల స్వార్ధ రాజకీయాలకు తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నా…
ఈ దేశంలోని పిల్లలకు, యువతకు స్పూర్తి, త్యాగభావం, ధర్మ రక్షణ భావం కల్పించాలనే ఆలోచనతో నరేంద్రమోదీ ప్రభుత్వం ఈరోజు వీర బాల దివస్ ను నిర్వహిస్తున్నారు. ఈ దివస్ వెనుక పెద్ద స్పూర్తిదాయకమైన చరిత్ర ఉంది. సిక్కు మతాన్ని వీడి ముస్లిం మతంలోకి మారకపోతే మిమ్ముల్ని చంపేస్తామంటూ చిన్న పిల్లలైన బాబా జొరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ లను మొగల్ చక్రవర్తి ఔరంగజేబు బెదిరించినా, వణికించే చలిలో నిలబెట్టినా, చిత్రహింసలు పెట్టినా భయపడకుండా నమ్మిన మతం కోసం బలిదానం చేసిన త్యాగధనులు. చివరకు ఆ పిల్లలను సమాధి చేయడానికి స్థలం ఇవ్వకుండా వేధించారు. ఎంత స్థలంలో బంగారు నాణేలాను కుప్పలా పేరుస్తారో… అంత మేరకు స్థలం ఇస్తామని మొగల్స్ చెబితే… ప్రతి ఒక్క సిక్కు ఆ నాణేలను కుప్పగా పేర్చి ఆ స్థలాన్ని కొని ఆ పిల్లలను సమాధి చేశారు. గురు గోవింద్ సింగ్ పిల్లలే కాకుండా ఆ కుటుంబ యావత్తు బలిదానం చేసిన చరిత్ర చాలా గొప్పది.
సిక్కుమత విశ్వాసాలను కాపాడటంలో రాజీలేని పోరాటం చేసిన చరిత్ర గురు గోవింద్ సింగ్ కుటుంబానిదే. గోవింద్ సింగ్ తండ్రిగారైన గురు తేజ్ బహదూర్ ను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చాలని అప్పటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ప్రయత్నించిండు. కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా గురు తేజ్ బహుదూర్ ఇస్లాం మతంలోకి వెళ్లడానికి అంగీకరించలేదు. ఔరంగజేబ్ అహం దెబ్బతినడంతో రగిలిపోయి తేజ్ బహుదూర్ తలను నరికివేయించిండు.
తేజ్ బహుదూర్ ను శిరచ్చేదం చేసినప్పుడు ఆయన కుమారుడైన గురు గోవిద్ సింగ్ వయస్సు 9 ఏళ్లు మాత్రమే. ఆ వయసులోనే సిక్కు గురువుగా మారి మార్షల్ ఆర్ట్స్ సహా అనేక విలు విద్యలు నేర్చుకుని వీర యోధుడిగా మారి సిక్కు మతస్తులకు రక్షణ కవచంగా నిలిచిండు. అంతేకాకుండా సిక్కులను రక్షించుకునేందుకు యోధుల సంఘాన్ని (ఖల్సా అంటారు) ఏర్పాటు చేసి అమాయక సిక్కులను రక్షించే యోధుడిగా తీర్చిదిద్దిండు. ఇది చరిత్ర అంటే… కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఈ చరిత్రను సమర్ధిస్తారా? వ్యతిరేకిస్తారా? సమాధానం చెప్పాలి. ఇన్నాళ్లు చరిత్రను వక్రీకరించి మొగల్స్ ను పొగిడిన ఆ పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలి.
బాధాకరమైన విషయం ఏందంటే…అంతటి దుర్మార్గులైన మొఘల్ చక్రవర్తులను సోకాల్డ్ లౌకిక వాదులు హీరోలుగా చిత్రీకరిస్తూ పాఠ్యపుస్తకాల్లో వాళ్ల చరిత్రను పొందుపర్చడం సిగ్గు చేటు.. గురుగోవింద్ సింగ్ వంటి గొప్ప వాళ్లను మాత్రం స్మరించుకునే తీరికే ఉండదు… హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన నీచులు మొగల్స్. ఇస్లాం మతంలోకి మారలేదనే కోపంతో హిందువులు, సిక్కుల మీద దాడులు చేయడమే కాకుండా పన్నుల మీద పన్నుల వేసిన దుర్మార్గులు. చివరకు జుట్టు పెంచుకుంటే కూడా పన్ను వేసి హింసించిన రాక్షసులు… వారికి వత్తాసు పలుకుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఆ వర్గం ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతుండటం సిగ్గు చేటు.
ఎంత బాధేస్తుందంటే… తీవ్రవాదులను తయారు చేసే, బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడే తబ్లిగీ జమాతే వంటి సంస్థలకు ఈ ప్రభుత్వం నిధులిస్తోంది. ప్రజల సొమ్మును తీవ్రవాదులను తయారు చేసే సంస్థకు పంచుతారా? సభ్య సమాజానికి అసలు ఏ సందేశం పంపుతున్నట్లు? ఒక వర్గం ఓట్ల కోసం బీఆర్ఎస్ పార్టీ పదేళ్లపాటు రజాకార్ వారసుల పార్టీతో అంటకాగింది. ప్రజలు ఆ పార్టీకి కర్రుకాల్చి వాతపెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తూ ఇస్లాం దేశాలు కూడా నిషేధించిన తబ్లిగీ జమాతే సంస్థకు నిధులిస్తోంది. ఎవరి అయ్య జాగీరనుకుంటున్నారు? ఆ సంస్థకు నిధులెలా ఇస్తారు? సిక్కులు ఘనంగా జరుపుకునే వీర్ బాల దివస్ కు నిధులెందుకు ఇవ్వరు? ఇది ప్రశ్నిస్తే బీజేపీని మతతత్వవాదులుగా ముద్ర వేస్తారా?
తబ్లిక్ జమాతే వంటి సంస్థ కు నిధులిస్తున్న ప్రభుత్వం 41 రోజుల కఠోర దీక్ష చేసే అయ్యప్ప స్వాములను ఎందుకు పట్టించుకోవడం లేదు. శబరిమలలో గత కొద్దిరోజులుగా అయ్యప్ప స్వాములు పడుతున్న బాధలు మీ కళ్లకు కన్పించడం లేదా? అక్కడ తాగడానికి నీళ్లు లేవు. తినడానికి తిండి లేదు. గజగజ వణికి చలిలో గంటల తరబడి నిలబడి అరిగోస పడుతున్న దారుణ ద్రుశ్యాలు మీడియా, సోషల్ మీడియాలో వస్తున్నా పాలకులు స్పందించకపోవడం సిగ్గు చేటు.
ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం కుట్ర చేస్తున్నారు. హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్ర చేస్తున్నారు. ఎక్కువ మంది దర్శించుకునే ధార్మిక ప్రదేశాల్లో భయానక వాతావరణాన్ని స్రుష్టిస్తూ, సరైన సౌకర్యాలు కల్పించకుండా చేయడంవల్ల భక్తులు రాకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారు.
తిరుమలలోనూ పులులు వస్తున్నాయనే భయంతో భక్తులు రాకుండా చేస్తూ హిందూ సనాతన ధర్మాన్ని దెబ్బతీసేలా కుట్ర జరుగుతోంది.
హిందూ సమాజమంతా ఆలోచించాలని కోరుతున్నా. మసీదులో పనిచేసే ఇమామ్ లకు, చర్చిల్లో పనిచేసే ఫాస్టర్లకు జీతాలిస్తున్న ప్రభుత్వం ఆలయ పూజారులకు, గురుద్వారాలో పనిచేసే గురువులకు జీతాలెందుకు ఇవ్వడం లేదో ఆలోచించండి. ఒక వర్గం ఓట్ల కోసం హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల స్వార్ధ రాజకీయాలకు తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నా అన్నారు.…