
ప్రజల మనిషి ఎమ్మెల్యే బొల్లం………
కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఆవుల రామారావు………
అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉండే ఎమ్మెల్యే బొల్లం కావాలో నెలకు, రెండు నెలలకు ఒకసారి వచ్చే టూరిస్టు నాయకులు కావాలో ప్రజలే తేల్చుకోవాలని కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఆవుల. రామారావు అన్నారు. మంగళవారం పట్టణంలోని28, 29 వార్డుల్లోపట్టణ అధ్యక్షుడు చందు. నాగేశ్వరరావు, కౌన్సిలర్ వంటిపులి. రమా, శ్రీనివాసులతో కలిసి గడప,గడపకు బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యారంటీ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అటువంటి పార్టీ చెప్పే మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. గతంలో ఎమ్మెల్యేను కలవాలంటే ప్రజా ప్రతినిధుల మైన తామే కోదాడ నుంచి ఎంతో ఖర్చు భరించి కారులో హైదరాబాదుకు వెళితే రెండు, మూడు రోజుల తర్వాత వారి దర్శనం దొరికేదని మరి సామాన్యుల పరిస్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోవాలన్నారు. కోదాడలో నేడు ఆ పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష అని జరగనున్న ఎన్నికల్లో ప్రజలు కారు గుర్తుకు అత్యధిక సంఖ్యలో ఓట్లు వేసి ఎమ్మెల్యేగా బొల్లం ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, గడియారం శ్రీను, సుంకర. అభిదర్ నాయుడు, గంధం. రాము, ఉమా తదితరులు పాల్గొన్నారు…….



