వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.
Doctors should be accessible to people.
వరంగల్ డి ఎం హెచ్ ఓ.బి.సాంబశివరావు.
వరంగల్ ప్రతినిధి.
మండల పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యులు నాణ్యమైన వైద్యాన్ని అందించి వారి మన్ననలను పొందాలని వరంగల్ జిల్లా డీఎంహెచ్ఓ డి సాంబశివరావు అన్నారు. వరంగల్ జిల్లాలోని ఖానాపురం చెన్నారావుపేట మండలాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు అనంతరం వారికి తగు విధమైన సూచనలు అందించారు. సాధారణంగా చలికాలంలో చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలు ముక్కు కారడము, అస్తమ, శ్వాస కోస వ్యాధులు, హార్ట్ ఎటాక్స్ ,చర్మ సంబంధిత వ్యాధులు మొదలగునవి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చిన్న పిల్లలకు, వృద్ధులకు షెటర్స్, గ్లౌజెస్ ,దుప్పట్లు నిండుగా కప్పుకొని చలికి గురి కాకుండా ఉండాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని మాతా శిశు సంరక్షణ, ప్రభుత్వ హాస్పిటల్ లో డెలివరీలు, వ్యాధి నిరోధక టీకాలు, అందించాలన్నారు. సంక్రమిత వ్యాధులు, అసంక్రమిత వ్యాధులు నిర్ధారణ పరీక్షలు చేయించి తగు చికిత్సలు అందించాలని తెలిపారురు. ప్రజలు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సూచనలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలన్నారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే వెంటనే సిబ్బంది ద్వారా తగు చికిత్సలు తీసుకోవాలని కోరినారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజల ఆరోగ్య అవసరాలకు నిర్మించినారు కాబట్టి సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని కోరినారు.
ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు డాక్టర్ అరుణ్ చంద్ర, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ జ్యోతి, డాక్టర్ సరోజ ,పల్లె దావకాన డాక్టర్లు ,డిప్యూటీ డెమో అనిల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.