- Advertisement -
పురుషుడికి మహిళ చేతులు అమర్చిన వైద్యులు
ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు అద్భుతం చేశారు. రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తికి శస్త్ర చికిత్స చేసి వాటిని అమర్చారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. దీంతో తన చేతులను తిరిగి పొందేందుకు వైద్యులను ఆశ్రయించాడు. ఇటీవలే బ్రెయిన్ డెడ్తో మరణించిన మహిళ చేతులను అతడికి విజయవంతగా ట్రాన్స్ ప్లాంట్ చేశారు వైద్యులు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు వైద్యులు.
- Advertisement -