Thursday, March 5, 2026

మళ్లీ అలాంటి దిక్కుమాలిన పాలన కాంగ్రెస్ పార్టీ కావాలా?

- Advertisement -

*తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పది అవకాశాలు ఇచ్చారు

కానీ వారు పదవులను అనుభవించారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు..*

మూడు గంటల కరెంట్ కావాలా……

24 గంటలు కరెంట్ కావాలి…..

-మంత్రి కొప్పుల ఈశ్వర్

జగిత్యాల జిల్లా బ్యూరో (నవంబర్ 20,23)వాయిస్ టుడే :ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలం, కప్పారావు పేట, శాఖాపూర్, వెంకటాపుర్, స్తంభం పల్లి, గ్రామాల్లో ఎన్నికల ప్రచారం లో భాగంగా ప్రజా ఆశీర్వాద యాత్ర భాగంగా సోమవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ కి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. గ్రామంలో మంత్రి కి మహిళలు మంగళహారతులు పట్టి బతుకమ్మ, కోలాటాలతో ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలనలో కరెంటు, సాగునీటికి ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు మళ్లీ ఆ దిక్కు మాలిన పాలన రాష్ట్రం కావాలా? అని మంత్రి ప్రశ్నించారు.తెలంగాణ పక్క ఆనుకొని కర్ణాటక ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది,
ఆ రాష్ట్రంలో రైతుబంధు లేదు, కరెంటు లేదు, నీళ్లు వస్తలేవు, రైతుబీమా లేదు, ఆడపిల్లల పెళ్లి చేసుకుంటు కల్యాణలక్ష్మి రాదు, ముసలివారికి ఆసరా పింఛన్లు రావడం లేదని, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వడం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి,ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించింది ఆపదమొక్కులు మొక్కుతున్నారు.కాంగ్రెస్ పార్టీ మంత్రి సూటి ప్రశ్న అడిగారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదు.ఈ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసి, తెలంగాణలో మాట్లాడాలి, గత 50 సంవత్సరాలు రాష్ట్రం లో దేశంలో పాలించింది కదా మరి కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎందుకు ప్రవేశపెట్టడం లేదు.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుగుతూ ఒక్క చాన్స్‌ ఇవ్వండి అని అడుక్కుంటున్నడు. ఆయనకు, మీ అందరికీ గుర్తు చేస్తున్నా. 75 స్వాతంత్య్రం అనంతరం ఒక్కఛాన్స్‌ కాదు.. మన రాష్ట్రంలో పది సార్లు అవకాశం ఇచ్చారు.కానీ వారు పదవులను అనుభవించారు. తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు
50 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్‌ పార్టీ. ఇదే నేను ధర్మపురి లో ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశంలో రాష్ట్రంలో ఉంది కానీ, వారి పరిపాలనలో పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్‌లు, కాలిపోయే మీటర్లు, అర్ధరాత్రి దొంగోలే వచ్చే కరెంటు. దానికి కాపాలా కాసేందుకు వెళ్లి ఎవరు పాముకుట్టి చనిపోతారో తెలియదు. తేలుకట్టి, కరెంటు షాక్‌ తగిలి చనిపోతారో తెలియని పరిస్థితులుండే.కేసీఆర్‌ తొమ్మిదేళ్ల పరిపాలనలో 65లక్షల మంది రైతులకు 65వేలకోట్ల రైతుబంధు ఖాతాల్లో వేసిన కేసీఆర్‌ పెద్దన్న కాదా? నెలకు 44 లక్షల మంది పెద్ద మనుషులు, వితంతువు, దివ్యాంగులు, నేతన్నలు, గీతన్నలకు పెన్షన్‌ ఖాతాల్లో వేస్తున్న మీ కుటుంబ సభ్యుడు కేసీఆర్‌ కాదా?.
ఇవాళ ఇంటి ముందు నల్లా తిరుగుతుందంటే ఆ నల్లా నుంచి నీళ్లు వస్తున్నయంటే నీళ్ల బాధ మా ఆడబిడ్డలకు తప్పించింది పెద్ద కేసీఆర్‌ మీ కుటుంబ సభ్యుడు కాదా? 12లక్షల మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కింద రూపాయలు 8వేలకోట్లు ఖర్చు చేసి లగ్గం చేసిన మేనమామ కేసీఆర్‌ కాదా? 14లక్షల మంది ఆడబిడ్డలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి చేయించి మాతా శిశు మరణాలు తగ్గించి ఈ రోజు 80శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుప్రతుల్లో జరుగుతున్నాయంటే.నేను రానుబిడ్డో సర్కారు దవాఖాన నుంచి నేను సర్కారు దవాఖానకే పోతా అక్కడ మా మేనమామ కేసీఆర్‌ ఇచ్చిన కేసీఆర్‌ కిట్‌ ఇస్తడు అనే పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్‌ కుటుంబ సభ్యుడు కాదా? అని మంత్రి ప్రశ్నించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్