- Advertisement -
శ్రీశైలం మల్లిఖార్జునస్వామి ఆలయానికి 108 బంగారు పూల విరాళం
Donation of 108 gold flowers to Srisailam Mallikarjunaswamy templeనంద్యాల సెప్టెంబర్ 6
జిల్లాలోని ప్రసిద్ధ శ్రీశైలం మల్లిఖార్జునస్వామి ఆలయానికి ఓ భక్తుడు 108 బంగారు పూలను విరాళంగా అందజేశారు. కర్నూలు జిల్లాకు చెందిన బిసి శివకుమార్ అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.ఈ సందర్భంగా అమ్మవారి ఆలయప్రాంగణంలో 19 గ్రాముల 108 బంగారు పూలను సీనియర్ వేదపండితులు, గంటి రాధకృష్ణ, పర్యవేక్షకులు కె. అయ్యన్న , ఆలయ ఇన్‌స్పెక్టర్ మల్లిఖార్జునకు అందజేశారు. దాతకు వేదాశీర్వచనముతో స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు.
- Advertisement -




