సీఎం సహాయ నిధికి వెల్లువెత్తుతున్న విరాళాలు
Donations pouring in to CM’s relief fund
తాడేపల్లిగూడెం,
సీఎం సహాయ నిధికి తాడేపల్లిగూడెం నుండి విరాళాలు వెల్లు వెత్తుతున్నా యి. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపుమేరకు వరద బాధితుల సహాయార్థం విరాళాలు అందిస్తున్నారు. సీఎం సహాయ నిధికి ముదునూరు పాడుకు చెందిన మేడపాటి శ్రీనివాసరెడ్డి, తండ్రి చక్రధర రెడ్డి రెండు లక్షల రూపాయలు, ఆరుగొలను జెసిబి యూనియన్ లక్ష రూపాయలు, మొక్క రాల శ్రీనివాసరావు లక్ష రూపాయలు, పడాల బాపిరెడ్డి లక్ష రూపాయలు, టిబిఆర్ రవి యాబై వేల రూపాయలు, జి .వి.వి యాభై వేల రూపాయలు, వర్త నపల్లి కాశి ఇరవై ఐదు రూపాయలు, తిరుపతి కంటేశ్వరరావు ఐదు రూపాయలు, కూరపాటి గంగరాజు ఇరవై ఐదువేల రూపాయలు, మారం గిరీష్ గుప్తా ఇరవై ఐదువేల రూపాయలు, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు అందజేశారు. , ఈ సందర్భంగా విరారాలను అందజేసిన దాతలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిగూడెం లోని దాతలు ఇంకా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అవసరమైతే నిధులతో పాటు ఆహార పదార్థాలను సమకూర్చేలా ఏర్పాటులు చేస్తామని తెలిపారు.