యువత చెడు వ్యసనాలకు లోనై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు..పి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ (ప్రభు)
జమ్మికుంట రైల్వే స్టేషన్లో శుక్రవారం కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ వెళ్తున్న సమయంలో ఇల్లందకుంట మండలం మల్లన్న పల్లె గ్రామానికి చెందిన రాజు అనే 30 సంవత్సరాల యువకుడు మద్యం తాగి స్టేషన్లోని ఫ్లైఓవర్ మెట్లు ఎక్కుతుండగా మద్యం మత్తులో ఉండి కాలుజారి పడడంతో తలకు తీవ్ర గాయం కావడంతో ప్రయాణికులు ఎవరు కూడా చూసి స్పందించకపోవడం బాధాకరం ఇట్టి విషయం తెలుసుకున్న తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ టి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ ప్రభు ఘటన స్థలానికి వెళ్లి అతని లేపి తీవ్ర రక్తస్రావం అవుతున్న అతన్ని రైల్వే అధికారులకు తెలిపి 108 వాహనాన్ని పిలిపించి ప్రథమ చికిత్స చేపించి, తర్వాత చికిత్సల కోసం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి డాక్టర్స్ తో మాట్లాడి చికిత్స చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా టి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మెట్లపై పడి తీవ్ర రక్తస్రావం జరిగిన కూడా ప్రయాణికులు చూసి ఎవరు కూడా స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకొని మానవత్వంతో ముందుకు సాగాలని కోరారు.