Saturday, February 21, 2026

ఢిల్లీలో జరుగుతున్న అవినీతికి మద్దతునివ్వకండి

- Advertisement -

ఢిల్లీకి రాష్ట్ర హోదా లేదు… ఢిల్లీ గురించి కూడా ఆలోచించాలి

లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్‌… కేంద్రహోం మంత్రి అమిత్‌షా

Don't support corruption in Delhi
Don’t support corruption in Delhi

న్యూఢిల్లీ ఆగస్టు 3, (వాయిస్ టుడే): కేంద్రహోం మంత్రి అమిత్‌షా లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్‌ని తీసుకొచ్చారు. విపక్షాల ఆందోళనల మధ్యే అమిత్‌షా ప్రసంగం కొనసాగింది. ప్రతిపక్షాలు INDIA కూటమిపై కాకుండా ఢిల్లీపై దృష్టి పెడితే బాగుంటుందని చురకలు అంటించారు షా. సుప్రీంకోర్టు తీర్పునీ లెక్క చేయకుండా బిల్ తీసుకొచ్చారన్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఢిల్లీలో పాలనా వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవచ్చని, ఆ అధికారం రాజ్యాంగమే ఇచ్చిందని తేల్చి చెప్పారు. కొందరు తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతోనే ఈ బిల్‌ని వ్యతిరేకిస్తున్నారని ఆప్‌పై విమర్శలు చేశారు. ఆప్‌ అవినీతినీ ప్రస్తావించారు. “2015లో ఆప్‌ అధికారంలోకి వచ్చింది. ఈ పార్టీ గద్దెనెక్కింది కేవలం కేంద్రంతో యుద్ధం చేయడానికే తప్ప ప్రజలకు మంచి చేయాలని కాదు. వాళ్ల సమస్య అధికారుల బదిలీ కాదు. ఈ బిల్‌ తీసుకొస్తే ఎక్కడ తాము అధికారం కోల్పోయి అవినీతి అంతా బయటపడుతుందోనని భయపడుతున్నారు”ఇదే సమయంలో కాంగ్రెస్‌పైనా విమర్శలు చేశారు అమిత్‌షా పండిట్ జవహర్ లాల్ నెహ్రూతో పాటు అంబేడ్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా లేదని, అలాంటప్పుడు కేంద్రం అక్కడి పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవచ్చన్న ప్రొవిజన్ రాజ్యాంగంలోనే ఉందని తేల్చి చెప్పారు. ఇండియా కూటమిలో ఎంత మంది చేరినా…మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని అన్నారు.”మీరు ప్రతిపక్ష కూటమిలో ఉన్నంత మాత్రాన ఢిల్లీలో జరుగుతున్న అవినీతికి మద్దతునివ్వకండి. ఢిల్లీకి రాష్ట్రహోదా ఇవ్వడాన్ని నెహ్రూతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేడ్కర్ వ్యతిరేకించారు. ప్రతిపక్ష ఎంపీలంతా కేవలం కూటమి గురించే కాదు. ఢిల్లీ గురించి కూడా ఆలోచించాలి”

– అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్