దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ భూత్ కమిటీ సమావేశం లో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జారే ఆదినారాయణ తదితరులు పాల్గోన్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ మనకి ఓటు పడే ఏ ఒక్క అవకాశం వదలద్దు. పాత కాంగ్రెస్ వారితో ఐక్యత తో ముందుకు వెళదాం. బులెట్ దిగిందా లేదా అనేది చూపిద్దాం. జోరేడ్ల బండిలా తుమ్మల, నేను మీకు వుంటాము. కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరి కష్టంలోను మా ప్రతినిధిగా జారేని నిలబెడుతున్నామని అన్నారు. ప్రత్యర్థులు గుండెనొప్పి అని పడిపోయి ఓట్ల కోసం నాటకాలు ఆడచ్చు ..ఏది నమ్మద్దు. బూత్ స్థాయిలో ప్రతి యాభై కుటుంబాలకు ఒక్కో ఏజెంట్ కష్టపడాలి. మ్యాజిక్ ఫిగర్ 60 లో మొదటిది అశ్వారావుపేట. మేము ఇరువురం కాంగ్రెస్ పార్టీ లో లేనపుడు కాంగ్రెస్ జెండా మోసి పార్టీ ని ముందుకు నడిపించిన మి అందరికీ ధన్యవాదాలని అన్నారు.
కాంగ్రెస్ లో చేరితే ఇబ్బందులు వుంటాయని ముందే తెలుసు. అయినా నిస్వార్థంగా ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చాం. రాష్ట్రంలో కొద్ది మంది స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారినవారిని వదిలేయండి. డిసెంబర్ 9 కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే అందరికీ పదవులు వస్తాయి. కొత్త బిచ్చగాళ్ల మాటలు పట్టించుకోవద్దు. తుమ్మల, నేను ఇద్దరం ఒక్కటే. ఏఐసీసీ నుండి ఎవరో ఒకరిని తీసుకువస్తాం. మీకు అందుబాటులోనే వుంటామని అన్నారు. డబ్బు, అధికార మదంతో వున్న అధికార పార్టీ, ఆ పార్టీ నాయకుల పప్పులు ఇక వుడకవు. మనకి డబ్బు, పదవులు లేవు కానీ మన ప్రజా బలం ముందు ఏది నిలవదు. ప్రతి ఒక్కరూ ఒక తుమ్మల, ఒక పొంగులేటి లా ప్రచారం చేసి జారే అదినారాయణను ని గెలిపించండని అన్నారు.