- Advertisement -
బోడుప్పల్, అక్టోబర్ 28 (వాయిస్ టుడే) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల చెంగిచెర్ల లో ఈరోజు స్థానిక బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ ఆధ్వర్యంలో (ఎం ఎల్ ఆర్) ఆక్షయ కాలనీలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేపట్టారు. బిఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కరాపత్రాలతో కారు గుర్తుకు ఓటు వేసి చామకూర మల్లారెడ్డి ని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్, యువ నాయకులు కొత్త విక్రమ్ గౌడ్, సీనియర్ నాయకులు మేకల శ్రీనివాస్ యాదవ్, ఎం.ఎల్.ఆర్ అక్షయ కాలనీ అధ్యక్షులు పిల్లి శ్రీకాంత్, నాయకులు, మహిళలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -