- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు ఈ బస్సు సర్వీసును ప్రారంభించారు.
నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
ఈ బస్సులో తిరుపతికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రయాణించారు.
ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ డి.హరిత మాట్లాడుతూ.. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులతో పాటు స్థానికులకు డబుల్ డెక్కర్ బస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఈ బస్సులో ప్రయాణించే వారికి సరికొత్త అనుభూతి లభిస్తోందన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా నగరపాలక సంస్థ పరిధిలో డబుల్ డెక్కర్ బస్సు సర్వీసు ప్రారంభించినట్లు చెప్పారు.

- Advertisement -



