- Advertisement -
ఏలేరు ఇరిగేషన్ వ్యవస్థ ఆధునీకరణ కు డీపీఆర్ రెడీ
DPR ready for modernization of Eleru irrigation system
కాకినాడ
కొత్తగా ఎన్నికైన నీటి వినియోగదారుల సంఘాల సలహాలు, సూచనలతో ఏలేరు ఇరిగేషన్ వ్యవస్థ ఆధునీకరణకు రివైజ్డ్ డిపిఆర్ రూపొందించి ప్రభు త్వానికి సమర్పించాలని కాకినాడ జిల్లా సమీక్షా కమిటీ నిర్ణయించిం దని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టనాభి వృద్ది శాఖ మంత్రి పొంగనూరు నారాయణ తెలిపారు. కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో కాకినాడ జిల్లా సమీకా కమిటీ సమావేశం జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టనాభివృద్ది శాఖ మంత్రి పొం గనూరు నారాయణ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, యంఎ ల్సీలు కర్రిపద్మశీ, బొర్రా గోపీమూర్తి, యంఎల్ఏలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ , యనమల దివ్య, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ, జనసేన పిఠాపురం నియోజక వర్గ ఇన్ చార్జి మర్రెడ్డి శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ మున్సిపల్ కమీషనర్ భావన, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన , జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో జిల్లా అభివృద్దికి జరుగుతున్న కార్యక్రమాల ప్రగతి, చేపట్టవలసిన భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించి నిర్ణయాల గొకొన్నారు. ఇందులో భాగంగా ఖరీఫ్ ధాన్యం సేకరణ, వ్యవసాయం, పురపాలన, పట్టణాభివృద్ది, మెప్మా, కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పధకం, త్రాగునీటి సరఫరా, రోడ్లు, భవనాలు, ఇరిగేషన్ అంశాలపై ప్రజాప్రతినిధులు చర్చించారు. సమావేశంలో సూచించిన అంశాలు, నిర్ణయాలపై ప్రాధాన్యతల కనుగుణంగా సత్వర చర్యలు చేపట్టి, వచ్చే డిఆర్సి సమావేశం లోపు అన్నిటిపై చర్యలుకత పూర్తి చేయాలని జిల్లా ఇన్ చార్జి మంత్రి నారాయమ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన సమావేశంలో చర్చించిన అంశాలను మీడియా ప్రతినిధులకు ప్రెస్ మీట్ లో వివరించారు. సదరు వివరాలను ఈ విధంగా ఆయన తెలిపారుః
– ధాన్యం సేకరణ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల జిల్లాలో రైతుల ఖరీఫ్ ధాన్యానికి బహిరంగ మార్కెట్ లో మద్దతు ధర మించి మంచి ధర లభించి రైతులకు మంచి ధర లభిస్తోందని ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేసారు. ధాన్యాన్ని అకాల వర్షాల నుండి కాపాడుకునేందుకు, ఆరబెట్టేందకునేందుకు టార్పాలిన్ లను సబ్సిడిధరపై సరఫరా చేసేలా ప్రభుత్వాన్ని కోరాలని కమిటీ నిర్ణయించింది.
– వ్యవసాయ శాఖ సమీక్షలో జూన్ ల వర్షాలు ప్రారంభం అయ్యే లోపు కాలువలు, డ్రెయిన్లలో కలుపు, పూడిక పనులు కాలువలు మూసిన వేంటనే చేపట్టేందుకు సిద్దం చేయాలని అధికారులను ప్రజాప్రతినిధులు కోరారు. రైతులకు నకిలీ విత్తనాల బెడద లేకుండా చూడాలని, నాణ్యమైన ఎరువులు అందేలా చర్యలు చేపట్టాలని సభ్యులు కోరారు.
– ఉపాధిహామీ పధకం అమలు సమీక్షలో 50శాతం రైతులు, 50 శాతం ఉపాధి హామీ పదకం నిధులతో వ్యవసాయ పనులను ఉపాధి హామీ పధకం క్రింద చేపట్టేలా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాలేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని కమిటీ నిర్ణయంచింది.
– ఇరిగేషన్ సమీక్షలో కాలువ శివారు భూములకు కూడా నీరందేలా షట్టర్ల రిపేర్లు, కాల్వల లైనింగ్ పనులు చేపట్టాలని కమిటీ అధికారులకు సూచించింది. నూతనంగా ఎన్నికైన నీటిసంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వారి అనుభవాల నుండి సేరించిన సూచనలతో 845 కోట్ల నిధులతో ప్రతిపాదించిన ఏలేరు వ్యవస్థ ఆధునీకరణకు రివైజ్డ్ ప్రోజక్స్ రిపోర్టు రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి సమర్పించాలని కమిటీ నిర్ణయించింది.
– మన్సిపల్ పరిపాలన సమీక్షలో సాలిడ్ వేస్ట్ నియంత్రణకు ఇప్పటికే విశాపట్నం, గుంటూరులలో విజయవంతమైన వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ ను రాజానగరం-కాకినాడల మద్య ఏర్పాటు ప్రతిపాదించి, ఇందుకు అవసరమైన భూమిని గుర్తించాలని అధికారులకు కమిటీ సూచించింది. ఉప్పాడలో అన్నకాంటీన్ ఏర్పాటుకు నిర్ణయించింది. కాకినాడలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఉప్పటేరుపై మూడవ బ్రిడ్జి , బైపాస్ రోడ్డు నిర్మించాలని కమిటీ నిర్ణయించింది. వచ్చే ఏప్రియల్ నుండి మున్సిపల్ పన్నుల నిధుల సిఎస్ఎఫ్ఎం పరిధి నుండి తప్పించి, స్థానిక సంస్థల పరిధిలోనే ఖర్చు చేసుకునేలా విధాన మార్పు చేయనున్నట్లు మంత్రి తెలియజేశారు. స్మార్ట్ సిటీ ప్రోజెక్ట్ క్రింద నిలిచిపోయిన పనులకు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేలు కోరారు. అలాగే మౌలిక సదుపాయాలు కల్పించి టిడ్కో గృహాలను లబ్దిదారులకు సత్వరం అందించాలని కోరారు.
- Advertisement -