(వాయిస్ టుడే): తెలంగాణ వైద్య మరియు ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా పనిచేస్తున్న డాక్టర్ గడాల శ్రీనివాసరావుకు ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ అడిషనల్ కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . ప్రస్తుతం డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా పని చేస్తున్నారు. ప్రభుత్వం గత కొన్ని నెలల క్రితం కమిషనర్ గా పనిచేస్తున్న శ్వేతా మహంతి ఢిల్లీకి బదిలీ కావడంతో అప్పటినుండి కమిషనర్ పోస్ట్ ఇన్చార్జిగా ప్రిన్సిపాల్ సెక్రెటరీ రిజ్వి ఉన్నారు. గతంలో నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేసిన అనుభవం డాక్టర్ గడాల శ్రీనివాసరావుకు ఉండటం వల్ల ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ అడిషనల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ గడాల శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై పూర్తి నమ్మకంతో నేషనల్ హెల్త్ మిషన్ అడిషనల్ కమిషనర్ గా బాధ్యతలను ప్రభుత్వం అప్పజెప్పిందని తెలిపారు. తనపై నమ్మకంతో అడిషనల్ కమిషనర్ గా బాధ్యతలు అప్ప చెప్పారని దీన్ని పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపినారు. అందరి సహాయ సహకారాల వల్ల నేషనల్ హెల్త్ మిషన్లో ఉన్న పథకాలన్నీ పూర్తిస్థాయిలో విజయవంతంగా నడిపిస్తానని తెలిపారు.



