Sunday, September 8, 2024

డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన హమీద్ పటేల్

- Advertisement -

ఈ రోజు బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ మసీదు దగ్గర ఉన్న, డా. బీఆర్ అంబేద్కర్ కూడలిలోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి, స్థానిక నాయకులతో కలిసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు, యువ జన నాయకులు ఆదిల్ పటేల్ పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ,
బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి డా. బీఆర్ అంబేద్కర్ అని అన్నారు. వెనుకబడిన వర్గాలకు ఆశ జ్యోతి అయ్యి, వారి శ్రేయస్సు కోసం ముందుకు వచ్చి కొట్లాడిన వ్యక్తి డా. బీఆర్ అంబేద్కర్ అని అన్నారు. అత్యంత శక్తివంతమైన భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించి, న్యాయ నిపుణుడిగా ప్రఖ్యాతి గాంచి, దేశ మూల స్థంభమైన ఆర్ధిక వ్యవస్థకు ఆర్ధిక నిపుణుడై, బహుముఖ ప్రజ్ఞశాలియై, పేరు గాంచిన గొప్ప సంఘ సంస్కర్త బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేద్కర్ అని అన్నారు.అణగారిన వర్గాలకు, వెనుకబడిన దళిత వర్గాలకు చేయూత అందించి వారికి అన్ని విధాలుగా తోడ్పాటు అందించిన గొప్ప దార్శనికుడు డా. బీఆర్ అంబేద్కర్ అని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు.

Dr. Hamid Patel pays tribute to BR Ambedkar statue
Dr. Hamid Patel pays tribute to BR Ambedkar statue

కార్పొరేటర్ హమీద్ పటేల్ తో బాటుగా కొండాపూర్ డివిజన్ యువ జన నాయకులు ఆదిల్ పటేల్, సీనియర్ నాయకులు సిద్ధిక్ నగర్ బస్తీ అధ్యక్షులు కాలే బసవ రాజు, నందు, నరసింహ సాగర్, బుడుగు తిరుపతి రెడ్డి, గణపతి, చారీ, విక్రమ్, రవి శంకర్ నాయక్, విజయ్, సాగర్ చౌదరి, ఆనంద్ చౌదరి, తిరుపతి యాదవ్, డా. సుదర్శన్, పూజ, మణెమ్మ, కచ్చావా దీపక్, జుబెర్, అమీర్, దుర్గ ప్రసాద్, నయీమ్, దిలీప్, లక్ష్మి బాయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్