నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరయిన డాక్టర్ కె. లక్ష్మణ్

- Advertisement -

నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరయిన డాక్టర్ కె. లక్ష్మణ్
హైదరాబాద్ జూలై 9

Dr. K. Lakshman appeared before the Nampally Special Court

;పార్లమెంట్ ఎన్నికల సమయంలో ముషీరాబాద్ లోనే దోమలగూడ పోలీస్ స్టేషన్ మరియు సూర్యాపేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదులో భాగంగా బుదవారం బిజెపి ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్   నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  భాజపా ప్రభంజనాన్ని ఎదుర్కోలేక, అప్పటి BRS ప్రభుత్వం మరియు నాయకులు రాచరిక విధానంలో తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు.ఈ వేధింపుల నేపథ్యంలో, వేలాది మంది భాజపా కార్యకర్తలు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా అనుసరిస్తోంది. మేము నమ్మిన సిద్ధాంతాల కోసం, దేశం కోసం పనిచేస్తున్న నిబద్ధత గల కార్యకర్తలం. న్యాయస్థానాల పట్ల, ధర్మం పట్ల మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. BRS, కాంగ్రెస్ పార్టీల కక్ష సాధింపు చర్యలకు లొంగకుండా, మేము దేశం కోసం పని చేస్తూనే ఉంటాం,” అని పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular