పటాన్చెరు లో  వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో డాక్టర్ లక్ష్మణ్

- Advertisement -

సంగారెడ్డి జిల్లా  పటాన్చెరు మండలం రుద్రారం గ్రామం గణేష్ దేవాలయ ఆవరణ లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా మాట్లాడారు. ప్రచార వాహనాలను రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఆశావర్కర్లు, స్వయం ఉపాధి సహకార సభ్యులను శాలువతో సన్మానించారు.

Dr. Laxman in Vikasit Bharat Sankalpa Yatra in Patancheru
Dr. Laxman in Vikasit Bharat Sankalpa Yatra in Patancheru

ఈ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు గ్రామ గ్రామాన తెలిసేలా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించామన్నారు. అనంతరం మాట్లాడుతూ ఎవరైతే లబ్దిదారులు ఉన్నారో వారికి సంబంధించిన కుటుంబాలకు, స్నేహితులకు ఇతరులకు ఈ సంక్షేమ పధకాలని వివరించి తద్వారా వారిని కూడా బాగస్వాము లను చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లాస్థాయి ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular