దొంగ వైద్యున్ని పట్టుకున్న జిల్లా వైద్య అధికారి డాక్టర్ రఘునాథ స్వామి

- Advertisement -

నిందితుడు ఫేక్ సర్టిఫికెట్స్ తో  పలువురికి వైద్యం…                                             

డయాబెటిక్, ఫిజిషియన్, పీడియాట్రిషన్ వైద్యునిగా అవతారమెత్తిన సుకుమార్..                                                               

క్లినిక్ ను సీజ్ చేసిన అదికారులు…                             

మోసలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. జిల్లా వైద్య అధికారి రఘునాథ స్వామి..                                                   

మేడిపల్లి, నవంబర్ 10 (వాయిస్ టుడే) :మేడ్చెల్ జిల్లా మేడిపల్లి మండలం  పిర్జాదిగూడ 8 వ డివిజన్ లో గల ఓ నకిలి వైద్యుని గుట్టు రట్టు చేసారు జిల్లా వైద్య అధాకారి డాక్టర్ రఘునాథ స్వామి.వివరాలు ఇలా తెలియజెసారు..గత సంవత్సర కాలంగా పిర్జాదిగూడ 8 వ డివిజనలో సుకుమార్ అనే వ్యక్తి ఫేక్ సర్టిఫికేట్లతో చలామని అవుతు ఓమిని క్లీనిక్ లో పలువురికి వైద్యం అందిస్తున్నాడు. తాను డయాబిటాలజిస్ట్ ని అని ఫీజీషియన్ ని అని,చిన్న పిల్లల వైద్యుడిని అంటు పలురకాలగా అవతారలెత్తి  అమాయక ప్రజలను మోసగిస్తున్న వ్యక్తిని స్తానికుల పిర్యదు మేరకు ఎట్టకేలకు జిల్లా వైద్య అధికారి నకిలి వైద్యుని పై విచారణ జరిపించి  నిర్ధారించి నిందుతుని క్లీనిక్ ను శుక్రవారం సీజ్ చేసారు.జిల్లా వైద్య అధికారి రావడం గమనించిన నకిలి వైద్యుడు తన షాప్ మూసుకుని లోపలనె ఉండి అధికారులకు తిరుపతిలో ఉన్న వారం రోజులు తరువాత వస్తానని ఫోన్ ద్వారా తెలియజేసాడు, కాని  వైద్యుడు లోపలే ఉన్నడని గమనించిన అదికారులు నిందుతుని అధికారుల సమక్షంలో బయటకు తీసుకు వచ్చి క్లీనిక్ ను సీజ్ చెసారు. ఈవిదమైన మోసలకు పాల్పడిన వారిపై పై  చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య అధికారి  రఘునాథ స్వామి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటి డిఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ నారాయణ, ఉప్పల్ మెడికల్ ఆఫీసర్ సౌందర్యలత,డెమో అంజన్న తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular