రూపాయికే డ్రెస్..రూపాయికే చీర
ఎగబడ్డ జనాలు…షాపు మూసివేత
హైదరాబాద్
Dress for one rupee.. Saree for one rupee
People are upset…Shop is closed
ఓ బట్టల షాపు షో రూం యజమాన్యం చేసిన ఓ మార్కెటింగ్ స్టంట్ బాంబులా బెడిసికొట్టింది. యువకుల దెబ్బకు వారికి దేవుడు కనిపించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సైదాబాద్ సింగరేణి కాలనీ ప్రధాన రోడ్డుపై ఓ బట్టల షాపు ప్రారంభమై సంవత్సరం ముగిసింది.. షో రూం ప్రమోట్ చేసుకోవటానికి.. మార్కెటింగ్ స్టంట్లో భాగంగా ఓ పెద్ద ఆఫర్ పెట్టారు. కేవలం రూపాయకే డ్రెస్ అని ప్రకటించారు. రూపాయకే చీర అని తెలియగానే యువకులు పెద్ద సంఖ్యలో ఆ షాపు దగ్గరకు వచ్చారు. పెద్ద ఎత్తున డ్రెస్ కోసం ఎగబడ్డారు. తోసుకుని మరీ షాపులోకి వెళ్లడానికి ప్రయత్నించారు. అక్కడికి వచ్చిన యువకులను అదుపు చేయటం షాపు వాళ్లకు సాధ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.
పోలీసులు వచ్చినా వారిని అదుపు చేయలేకపోయారు. చివరకు కంట్రోల్ తప్పడంతో పోలీసుల సహాయంతో షో రూమ్ బంద్ చేశారు. దీంతో యువకులు వెనుదిరిగారు