ఏపీ, తెలంగాణలో 12 రోజుల్లో రూ.5.74 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న “డ్రింకర్ సాయి” మూవీ
"Drinker Sai" movie is running successfully with gross collections of Rs.5.74 crores in 12 days in AP and Telangana*
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. గత డిసెంబర్ 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “డ్రింకర్ సాయి” సినిమా యునానమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
“డ్రింకర్ సాయి” సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో విడుదలైన అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా 12 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 5.74 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాలోని కంటెంట్ యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది.
నటీనటులు – ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు