Wednesday, December 4, 2024

ఉదయాన్నే తేనె-నిమ్మరసం కలిపి తాగుతున్నారా?

- Advertisement -

ఉదయాన్నే తేనె-నిమ్మరసం కలిపి తాగుతున్నారా?

Drinking honey-lemon juice in the morning?

 రోగనిరోధకశక్తి బలోపేతం కావటానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విశృంఖల కణాలను, హానికారక బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలు దండిగా ఉంటాయి..

తేనెను శుద్ధి చేసినప్పుడు, వెలుగు తగిలినప్పుడు దీనిలోని పుప్పొడి దెబ్బతింటుంది. ఎక్కువ పోషకాలు ఉండేది ఇందులోనే. అందువల్ల ముడి తేనె అయితే మేలు.

క్యాల్షియం, ఐరన్‌, సోడియం, ఫాస్ఫరస్‌, సల్ఫర్‌, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్‌ సి, విటమిన్‌ బి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉంటాయి.
ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి.
ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచాడు తేనె, సగం చెక్క నిమ్మరసం కలిసి పరగడుపున తాగితే మలబద్ధకం, ఛాతీ మంట తగ్గుతాయి.
ఊబకాయం తగ్గటానికి ఉపవాసం చేసేవారు తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
మద్యం తాగిన మర్నాడు తలెత్తే తలనొప్పి వంటి సమస్యలకూ తేనె కళ్లెం వేస్తుంది. ఇందులోని ఫ్రక్టోజ్‌ అనే సహజ చక్కెర కాలేయం మద్యాన్ని త్వరగా విడగొట్టేలా చేస్తుంది.

హాయి భావన కలిగిస్తుంది.
చెంచా తేనెకి… చెంచా నిమ్మరసం కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఒక కప్పు హెర్బల్‌టీకి ఒక చెంచా తేనె కలిపి తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి చక్కని డిటాక్సిఫికేషన్‌ జరుగుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు చెంచా తేనెకి… అరచెంచా దాల్చినచెక్క పొడి కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. పంటిసమస్యల నుంచీ ఉపశమనం కలుగుతుంది.
రెండు చెంచాల యాపిల్‌సిడార్‌ వెనిగర్‌కి ఒక చెంచా చొప్పున తేనె కలిపి తాగితే… సైనస్‌ అదుపులో ఉంటుందట.
తేనె, గులాబీనీరు వంటి వాటిలోని వ్యాధినిరోధక గుణాలు మచ్చలను దూరం చేస్తాయి. గులాబీ నీరు చర్మంలోని పీహెచ్‌ స్థాయులను సమన్వయం చేసి, తాజాగా ఉంచుతుంది.
ఆరోగ్యమైన, సహజ రంగులో అధరాలుండాలంటే మృతకణాలను తొలగించాలి. అందుకు స్పూను తేనెలో పంచదారను కలిపి సున్నితంగా రుద్దితే మంచి ఫలితముంటుంది..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్