మత్తు కలిపిన కూల్డ్రింక్ తాగించి నగ్న ఫొటోలు తీసి

- Advertisement -

బ్లాక్మెయిల్ .. లైంగిక దాడి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ యువతి

ఏపీలో జీరో ఎఫ్ఐఆర్.. మధురానగర్ పీఎస్కు బదిలీ

Drinking intoxicating cold drink and taking nude pictures
Drinking intoxicating cold drink and taking nude pictures

వెంగళరావునగర్, : పట్టీ గేమ్ తో పరిచయమైన ఓ యువతికి మత్తు కలిపిన కూల్డ్రింక్ తాగించి నగ్న ఫొటోలు తీశాడు. ఆపై వేధింపులతో పాటు లైంగిక దాడి చేయగా ఆ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఏపీలో జీరో ఎఫ్ఎస్ఐఆర్ నమోదైన కేసు.. మధురానగర్ పోలీసు స్టేషన్కు బదిలీ అయ్యింది. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కోన సీమ జిల్లాకు చెందిన యువతి (21)కి తన బంధువైన మరో యువతి ద్వారా గండేపల్లి మండలం పి. నాయకంపల్లి గ్రామానికి చెందిన వలంటీర్ జాషువా, కపిలేశ్వర మండలం అంగారా గ్రామానికి చెందిన వాసకుమార్ నర్సింహ మూర్తి పట్టీ గేమ్ తో పరిచయమయ్యారు. 2020, జూన్ 10న జాషువాను ఆ యువతి పెండ్లి చేసుకుంది. అయితే నర్సింహమూర్తి ఆ యువతిని వేధించడం మొదలు పెట్టాడు. ఉద్యోగం కోసం బల్కంపేటకు వచ్చినా వేధింపులు ఆపలేదు. పథకం ప్రకారం నర్సింహమూర్తి.. జవహర్ నగర్లోని మల్లన్నగుట్టలో ఉన్న తన రూమ్కు ఆ యువతిని తీసుకెళ్లి కూల్ డ్రింక్ లో మద్యం కలిపి ఇచ్చాడు. అనంతరం నగ్నంగా ఉన్న ఫొటోలను తీసి బ్లాక్ మెయిల్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం నర్సింహ మూర్తి ఏపీలోని తన ఊరెళ్లాడు. బాధిత యువతి ఏపీ వెళ్లి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular