- Advertisement -
నిత్యం సమావేశాలు, సమీక్షలతో బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ కాసేపు సరదాగా గడిపారు. స్వయంగా బోటు నడుపుతూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల మిడ్ మానేరులోని బోటింగ్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పర్యాటకుల్లో ఉత్సాహం నింపేందుకు కేటీఆర్ స్వయంగా బోటు స్టీరింగ్ పట్టుకున్నారు.జలాశయంలో బోటుపై తిరుగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. పర్యాటకులను ఆకర్షించేందుకే బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినట్టు కేటీఆర్ తెలిపారు.
- Advertisement -