మద్యం సేవించి వాహనాలు
నడిపితే జరిమాన.. జైలు తప్పదు..
రోడ్డు ప్రమాదాల నివారణకే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు
గడిచిన 30 రోజులో మద్యం సేవించి వాహనలు నడిపిన 1044 మంది పై కేస్ లు
జగిత్యాల జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ వెల్లడి
జగిత్యాల
గడిచిన 30 రోజులో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ లలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 1,044 మంది వ్యక్తులకు పట్టుకోవడం జరిగింది అని ఇందులో 334 మంది వ్యక్తులకు కోర్టు ద్వారా రూ. 3,19,500 జరిమానలు విధించడం జరిగిందిని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణం అయితే సెక్షన్ 304-II కేసు లు నమోదు చేయడం జరుగుతుందని జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయడం జరుగుతుందని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడంతో పాటు, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే వారి తల్లదండ్రులకు బాధ్యత వహంచాలనీ హెచ్చరించారు. వాహనదారులు, రోడ్డు నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని ఎస్పీ కోరారు.



