మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం…

- Advertisement -

మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం…
ఒకరు మృతి..
ఏడు మంది యువకులకు తీవ్ర గాయాలు
కారు  చౌటుప్పల్ ఎమ్మార్వో దిగా గుర్తింపు
రంగారెడ్డి
చైతన్య పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్  కమాన్ వద్ద  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం కు గురైన కార్  చౌటుప్పల్  ఎం ఆర్ ఓ  హరికృష్ణ  పేరుతో ఉన్నట్లు సమాచారం. ఎల్బీనగర్ – ఉప్పల్ రోడ్ లో  వేగంగా దూసుకుపోతున్న కారు రాజీవ్ గాంధీ నగర్ కమాన్ ను డి కొట్టడం తో కార్ లో ఉన్న 7 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.  గుర్తుతెలియని ఒక పాదాచారి చనిపోయారు. చౌటుప్పల్ ఎంఆర్ఓ కుమారుడు సాయి కార్తీక్  తన తండ్రి   కారు ను  తీసుకుని తన స్నేహితులతో కలిసి ఓ బర్త్ డే పార్టీకి వెళ్లగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ప్రమాద సమయంలో కారు ను సాయి కార్తీక్ డ్రైవ్ చేస్తున్నారని సమాచారం.  ప్రమాదం లో గాయపడిన ఏడుగురిలో  నలుగురు యువకులను గాంధీ ఆస్పత్రి కి తరలించి,సాయి కార్తీక్ తో పాటు మరో ఇద్దరు యువకులని కొత్త పేట ఓమ్ని హాస్పిటల్ కు తరలించి చికిత్స  అందిస్తున్నారు. ప్రమాదం తీవ్ర స్థాయిలో జరగడం తో  కార్ పూర్తిగా ధ్వంసమైంది.  యువకులకు తీవ్ర గాయాలు కావడంతో అందరూ అపస్మారక స్థితిలో ఉన్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.  చైతన్య పురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular