తాగుబోతు కెసిఆర్ చేతిలో రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారు
రూ.3900 కోట్ల లోటుతో రాష్ట్రాన్ని కెసిఆర్ తనకు అప్పగించారు
కెసిఆర్ చేసిన అప్పులకు నాలుగు నెలల్లో రూ.26 వేల కోట్లు మిత్తీ కట్టాం
మహిళల ఉచిత ప్రయాణానికి రూ.1300 కోట్లు ఆర్‌టిసి చెల్లించాము
కొడంగల్ సెగ్మెంట్ మద్దూరులో కార్యకర్తలతో రేవంత్ రెడ్డి
మహబూబ్‌నగర్ ఏప్రిల్ 23
మారుమూల కొడంగల్‌కు కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్ నుంచే సిఎం వరకు తన ప్రస్థానం ఇక్కడే ప్రారంభమైందని, ఎవరికైనా ఇచ్చే స్థాయికి కొడంగల్‌ను కాంగ్రెస్ చేర్చిందన్నారు. కొడంగల్ సెగ్మెంట్ మద్దూరులో కార్యకర్తలతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పాలమూరు నుంచి బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను ఎంపిగా గెలిపిస్తే ఫాంహౌస్‌లో పడుకున్నాడని, కెసిఆర్‌లా ఫాంహౌస్‌లో పడుకోకుండా ప్రజల్లోకి తాను పోతున్నానని స్పష్టం చేశారు.చెపినా ఒక్క మాటలను కెసిఆర్ నిలబెట్టుకోలేదని, రూ.3900 కోట్ల లోటుతో రాష్ట్రాన్ని కెసిఆర్ తనకు అప్పగించారని, కెసిఆర్ చేసిన అప్పులకు నాలుగు నెలల్లో రూ.26 వేల కోట్లు మిత్తీ కట్టామని, మహిళల ఉచిత ప్రయాణానికి రూ.1300 కోట్లు ఆర్‌టిసి చెల్లించామని, తాగుబోతు కెసిఆర్ చేతిలో రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారని రేవంత్ ధ్వజమెత్తారు. పంద్రాగస్టు లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, తాను రుణమాఫీ చేస్తే కెసిఆర్, హరీష్ రావు బిఆర్‌ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా? అని సవాల్ విసిరారు. రైతులతో బ్యాంకు అధికారులు జాగ్రత్తగా ఉండాలని, రైతులను బ్యాంకర్లు ఇబ్బంది పెడితే తాము ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్‌ను దొంగదెబ్బ తీయాలని బిఆర్‌ఎస్, బిజెపి వాళ్లు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.మక్తల్ ఎత్తిపోతలకు ఆనాడు బిజెపి నేత డికె అరుణ అడ్డుకోవడంతో పాటు కృష్ణా జలాలు, రైల్వే లైన్ రాకుండా చేశారని విమర్శలు గుప్పించారు. మంత్రిగా ఉండి డికె అరుణ ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని, శత్రువు చేతిలో కత్తివై పాలమూరు కంట్లో పొడుస్తున్నావని అరుణకు చురకలంటించారు. పాలమూరు అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, గోడల మీద రాస్తే వీధుల్లోకి వస్తే అది భక్తి కాదని బిజెపి ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు.
తాగుబోతు కెసిఆర్ చేతిలో రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారు
- Advertisement -
- Advertisement -