చెంగిచర్ల లో చెత్త ఆటో బీవత్సం..
రెండు కార్లు.. రెండు బైకులు డీ..
పోలీసుల అదుపులో నిందితుడు.
ఫోటో రైటప్ 03: మేడిపల్లి 01: సీసీ టీవీ పుటేజీ.
ఫోటో రైటప్ 03: మేడిపల్లి 02: మృతి చెందిన లొంపి బాబీ.
మేడిపల్లి, జనవరి 03 (వాయిస్ టుడే) : మేడ్చెల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచర్ల లో మున్సిపాలిటీ కి చెందిన చెత్త సేకరించే ఆటో భీమాత్సవం సృష్టించింది. మంగళవారం సాయంత్రం చెంగిచర్ల వద్ద మున్సిపాలిటీ కి చెందిన చెత్త సేకరించే ఆటో రెండు కార్లు ను , రెండు బైకు లను డీ కొట్టింది, ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు కి గాయాలు అయ్యాయి, బాధితులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడు నాచారం కి చెందిన లొంపి బాబీ (23), అతని బైక్ పై ఉన్న భార్య రోజా పరిస్థితి విషమంగా ఉంది, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.