- Advertisement -
ఎస్సీ వర్గీకరణ తరువాతే డీఎస్సీ నియామకాలు చేయాలి
DSC appointments should be made only after SC classification
హైదరాబాద్
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే డీఎస్సీ నియామక పత్రాలను అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాదిగ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఋషిపాక గణేష్ మాదిగ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ మాదిగ పరిశోధన విద్యార్థుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గణేష్ మాదిగ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 1న అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేపడతామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి మొదటి నుండి మాదిగల మద్దతుతోనే ఈ స్థాయికి వచ్చానని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ పలాలు మాదిగ విద్యార్థులకు అందే విధంగా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు. అక్టోబర్ 9న చేపట్టే డీఎస్సీ నియామకాల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని నేను పక్షంలో ప్రక్రియను అడ్డుకుంటామని హెచ్చరించారు.
- Advertisement -