మహిళా ఉపాధ్యాయినిలకు సముచిత గౌరవం
Due respect for women teachers
వనపర్తి
తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఉపాధ్యాయినిలకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించిందని, జనవరి 3న నిర్వహించే సావిత్రిబాయ్ పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడం హర్షించదగ్గ విషయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వనపర్తి పట్టణంలోని హరిజనవాడ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కాంప్లెక్స్ లెవెల్ TLM కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల బతుకులు మార్చిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని ఆయన అన్నారు. భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలుగా మహిళ లోకానికి ఎన్నో గొప్ప సేవలందించిన త్యాగమూర్తి సావిత్రిబాయి పూలే అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళా ఉపాధ్యాయినిలను mla శాలువాలతో సన్మానించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన విజ్ఞాన ప్రదర్శనను ఆయన సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు
విద్యార్థులు అందరూ చదువుతోపాటు ఆటపాటలపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని, వనపర్తి పట్టణ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ కౌన్సిలర్లు, జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు మహిళా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు