దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ మూవీ సెప్టెంబర్ 3న రిలీజ్
Dulquer Salmaan’s movie ‘I Am Game’ to release on September 3.
దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ కొత్త విడుదల తేదీని ఖరారు చేశారు. తొలుత ఆగస్టు 20న ఓనం కానుకగా విడుదల చేయాలని ప్రకటించిన ఈ చిత్రం.. ఇప్పుడు రెండు వారాలు వాయిదా పడి సెప్టెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో విడుదల తేదీని మార్చినట్లు మేకర్స్ తెలిపారు.
దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్‌కు నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్నారు. సజీర్ బాబా, ఇస్మాయిల్ అబూబకర్, బిలాల్ మొయిదు స్క్రీన్‌ప్లే అందించగా.. సజీర్ బాబా, ఆదర్శ్ సుకుమారన్, షబాస్ రషీద్ సంభాషణలు రాశారు.
‘ఐ యామ్ గేమ్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్, ఫస్ట్ సింగిల్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైన ట్రైలర్‌లో అదిరిపోయే విజువల్స్, హై-ఆక్టేన్ యాక్షన్, థ్రిల్లింగ్ ఛేజ్ సీక్వెన్స్‌లు ఆకట్టుకున్నాయి. దుల్కర్ సల్మాన్‌ను స్టైలిష్ మాస్ అవతార్‌లో చూపించిన తీరు సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
దక్షిణ భారతదేశంలోని 100కు పైగా లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమా.. మలయాళ సినీ పరిశ్రమలో భారీ స్థాయిలో తెరకెక్కిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. ఇది దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 40వ సినిమా కావడం మరో ప్రత్యేకత. ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు-దర్శకుడు మిస్కిన్, కాయదు లోహర్, కతిర్, పార్థ్ తివారీ, సంయుక్త విశ్వనాథన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అన్బరివ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. జీ మ్యూజిక్ ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను సొంతం చేసుకుంది.
బ్లాక్‌బస్టర్ ‘లోక: చాప్టర్ 1 – చంద్ర’ తర్వాత వేఫేరర్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘ఐ యామ్ గేమ్’పై మరింత ఆసక్తి నెలకొంది. అలాగే ‘ఆర్‌డీఎక్స్’ తర్వాత నహాస్ హిదాయత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం కూడా అంచనాలను పెంచుతోంది.
మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ‘ఐ యామ్ గేమ్’.. దుల్కర్ కెరీర్‌లో మరో భారీ చిత్రంగా నిలిచేందుకు సిద్ధమవుతోంది.




